చైనా సైన్యం మన దేశంలోకి మరోసారి అక్రమంగా
చొరబడింది.. లడఖ్ లోని దౌలత్ బేగ్ ఓల్డీలో ఏకంగా 10 కిలోమీటర్ల లోనికి వచ్చి సైనిక
స్థావరం ఏర్పాటు చేసింది.. ఈ విషయాన్ని మన దేశం ఆలస్యంగా గ్రహించింది.. దేశ
భద్రతకు సంబంధించిన అత్యంత ప్రధానమైన ఈ వార్తకు మన మీడియా అంతగా ప్రాధాన్యత
ఇచ్చినట్లు కనిపించలేదు.. ఫలితంగా దేశ ప్రజలకు ఇదో చిన్న వార్తగానే కనిపించడం
దురదృష్టకరం..
చైనా పట్ల మన దేశ విధానం మొదటి నుండీ వివాదాస్పదంగా ఉంది.. మనం హిందీ-చీనీ భాయి భాయి అని ముచ్చట పడుతున్నాం.. కానీ చైనా మన పట్ల మొదటి నుండి శతృ వైఖరితోనే ఉంది.. భారత దేశ భూభాగాలపై దర్జాగా తిష్టేసినా శాంతి-చర్చలు అంటూ మన ప్రభుత్వం కాలాయాపన చేస్తోంది.. 1962లో మన దేశంపై ఏక పక్షంగా కయ్యానికి దిగి ఓడించినా మన పాలకులకు బుద్ధి రాలేదు..
ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, లడాఖ్ ప్రాంతాల్లోని భూ భాగాలకు మింగేసిన చైనా హిందూ మహా సముద్రంలో సైతం స్థావరాలు ఏర్పాటు చేసుకుంది.. శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, మాల్దీవులు, బంగ్లాదేశ్ దేశాలను తనవైపు తిప్పుకొని ఆ దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు తెరవేసింది..
పాకిస్తాన్ మనకు ఎంత శత్రువో, చైనా అంతకన్నా పెద్ద ప్రమాదకర శత్రువు.. దురదృష్టవశాత్తు మీడియా సైతం మన ప్రభుత్వాన్ని, ప్రజలను అప్రమత్తం చేయలేకపోతోంది.. ఇప్పటికైనా చైనా విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి..

No comments:
Post a Comment