రాష్ట్రపతి కోటాలో సచిన్ టెండూల్కర్ ను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అతి తెలివిని ప్రదర్శించింది.. సచిన్నే రాజ్యసభకు ఎందుకు పంపాలి? సచిన్ గొప్ప ఆటగాడే కావచ్చు, శత శతకాలు కొట్టి ఉండొచ్చు కాదనను.. ఆయనకన్నా గొప్ప ఆటగాళ్లు లేరా? ఆయనకన్నా సీనియర్ ఆటగాళ్లు కపిల్ దేవ్, గవాస్కర్ ఏం పాపం చేశారు.. ఆ మాటకొస్తే క్రికెటర్లను, సినిమా తారలను రాజ్యసభకు పంపాల్సిన అవసరం ఏమిటి? ఈ దేశంలో మేధావులు, కళాకారులు కరువయ్యారా? యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా, ఇంకా జట్టునే పట్టుకునే ఈ అత్యాశాపరుని వల్ల దేశానికి వచ్చే లాభం ఏమిటి? ఎవరొ గిఫ్ట్ ఇచ్చిన విదేశీ కారుకు పన్ను కట్టకుండా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వాన్ని బతిమిలాడుకున్న ఈ అత్యాశాపరుని ద్వారా రాబోయే ఎన్నికల్లో లాభపడాలని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోంది.. సచిన్ దంపతులు రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నందుకు రాష్ట్రపతికి, ప్రధానికి ధన్యవాదాలు చెప్పేకన్నా సోనియా గాంధీ ఇంటికి వెళ్లడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి.. కుంభకోణాలు, అసమర్థ పాలనతో సతమతమౌతున్న ఆ పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఎత్తుగడ వేసిందనేది చెప్పక తప్పదు.. దేశ ప్రజలంగా ఈ అంశాన్ని గుర్తంచుకోవడం మంచిది..
No comments:
Post a Comment