Wednesday, November 23, 2016
Saturday, November 19, 2016
Sunday, November 13, 2016
గ్రూప్ టూ.. ఇదేం తీరు?
తెలంగాణ
స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరు హైందవ ధర్మాన్ని అవమానించే విధంగా ఉంది..
గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ పరీక్షలు రాసేందుకు వచ్చిన వివాహిత మహిళల మంగళ సూత్రాలు
తీయించారు.. ఇదే తల తిక్క నిబంధన.. తాలిబొట్టు పరీక్షకు ఎలా ఆటంకం అవుతుంది?
ఇలాంటి అమంగళం ఇష్టం లేని కొందరు మహిళలు పరీక్షకు హాజరు కాకుండానే వెనుదిరిగారనే
వార్తలు షాక్ కలిగించాయి..
మహిళల
ఆత్మగౌరవాన్ని హరించే ఈ చర్యల విషయంలో రాజకీయ పార్టీలు, యువజన విద్యార్థి సంఘాలు,
సోకాల్డ్ ప్రజా సంఘాలు ఈ విషయంలో ఎందుకు మౌనం పాటించాయో అర్థం కావడం లేదు..
ఈ
నిబంధనలు కేవలం మంగళ సూత్రాలకే వర్తించారా? లేక క్రాస్, బురఖాలకు కూడానా?., ఇదేనా
లౌకిక వాదం, మత సామరస్యం?.. TSPSC పెద్దలు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది..
ఉప్పు కొరత పుకార్ల వెనుక కుట్ర ఏమిటి?
అదిగో
పులి అంటే ఇదిగో తోక అన్నట్లుంది వ్యవహారం.. సామాన్యునిడి నిత్యావసరం ఉప్పు..
ఉప్పు లేని తిండి రుచించదు.. నీ ఉప్పు తిన్నవాడిని అంటూ విశ్వాసం ప్రకటిస్తారు.. మన
స్వాతంత్ర్య పోరాటంలో ఉప్పు సత్యాగ్రహ పాత్ర విస్మరించలేనిది..
దేశంలో
ఉప్పుకు కొరత వచ్చిందంటూ పుకార్లు ఉప్పెనలా సాగాయి.. జనం పరుగులు తీసి కిలోల
కొద్దీ ఉప్పు కొని దాచుకోవడం మొదలు పెట్టారు.. కిలో ఉప్పు ధర రూ.25 నుండి అమాంతం
రూ.500 దాకా పెరిగిపోయింది..
కిరాణా
షాపుల ముందు బారులు, జనం తొక్కిసలాటలో ఒక మహిళ మృతి, పోలీసుల లాఠీ ఛార్జీ, ఉప్పు
లూఠీలు జరిగిపోయాయి.. ఉప్పు నోస్టాక్ అంటూ బోర్డులు పెట్టి బ్లాక్ మార్కెట్ కు తెర
తీశారు వ్యాపారులు.. దేశంలో ఉప్పు కొరత లేదని ప్రభుత్వం ప్రకటించినా జనం నమ్మని
పరిస్థితి..
కరెన్సీ
కొరతతో జనం సతమతం అవుతున్న వేళ పులిమీద పుట్రలా ఇలాంటి పుకార్లు వ్యాపిస్తున్నది
ఎవరు?.. బాధ్యత లేని సోషల్ మీడియానే ఇందుకు కారణం..
ఒక్కసారి
ఆలోచించండి.. మన దేశంలో ఎక్కడికి వెళ్లినా ఉప్పు విస్తారంగా, చౌకగా దొరుకుతుంది.
మనకు అపారమైన సముద్ర తీరం ఉంది.. కయ్యల్లో ఇబ్బడి ముబ్బడిగా ఉప్పు తయారవుతుంది..
ఉప్పు కొరత అంటే ఎలా నమ్మగలం.. అలా నమ్మిన వారిని వెర్రివారిగా జమ కట్టక తప్పదు..
నిజానికి
మనం ఉప్పును ఆహారంలో ప్రత్యేకంగా కలుపుకోవాల్సిన అవసరం లేదు.. మన తీసుకునే ఆహారంలో
సహజ సిద్దంగా ఉండే ఉప్పు శరీరానికి సరిపోతుంది.. కాస్త రుచికోసం చిటికెడు ఉప్పు కూరల్లో,
మజ్జిగన్నంలో వేసుకుంటే చాలు.. చిటికెడుకన్నా ఎక్కువ ఉప్పును మనం రుచి చూడగలమా?..
కిలోలు కిలోలు ఉప్పు కొని దాచుకొని ఏమి చేయగలం?.. ఈ మాత్రం కామన్ సెన్స్ మనకు ఉంటే
చాలు.. దయచేసి ఇలాంటి ఉత్త పుకార్లను ప్రోత్సహించి, జనాలను వెర్రివాళ్లను
చేయకండి.. నల్ల వ్యాపారుల కుట్రలో భాగస్వాములు కాకండి..
Friday, November 11, 2016
చివరకు ట్రంప్ గెలిచాడు..
ట్రంపు నోటి కంపు చూసి ప్రపంచమంతా జుడుసుకుంది.. కానీ అమెరికన్లకు ఆయన మాటలు వినసొంపుగా, ఇంపుగా అనిపించాయి.. గాడ్ బ్లెస్ అమెరికా.. అమెరికాను ఆ దేవుడే కాపాడుగాక..
Saturday, November 5, 2016
ఇద్దరూ ఇద్దరే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలుస్తుందా?, ట్రంపు గెలుస్తాడా? అని చాలా మంది మిత్రులు అడుగుతున్నారు..
నా దృష్టిలో ఎవరు గెలిచినా ఒకటే.. మనకు ప్రత్యేకించి ఒరిగేది ఏమీ లేదు.. వారి దేశ ప్రయోజనాల కోసమే పని చేస్తారు..
ఇద్దరిలో ప్లస్సులూ ఉన్నాయి.. మైనస్సులూ ఉన్నాయి.. ఎవ్వరూ సుద్ద పూసలు కాదు.. ఎన్నికల ప్రచారంలో వారి తీరు ఏమిటో చూశాం కదా..
అందుకే ఈ విషయంలో బుర్రలు బద్దలు కొట్టుకోకండి.. ఎవరు గెలిచినా భారతీయుల ప్రయోజనాలు కాపాడబడాలి..
నా దృష్టిలో ఎవరు గెలిచినా ఒకటే.. మనకు ప్రత్యేకించి ఒరిగేది ఏమీ లేదు.. వారి దేశ ప్రయోజనాల కోసమే పని చేస్తారు..
ఇద్దరిలో ప్లస్సులూ ఉన్నాయి.. మైనస్సులూ ఉన్నాయి.. ఎవ్వరూ సుద్ద పూసలు కాదు.. ఎన్నికల ప్రచారంలో వారి తీరు ఏమిటో చూశాం కదా..
అందుకే ఈ విషయంలో బుర్రలు బద్దలు కొట్టుకోకండి.. ఎవరు గెలిచినా భారతీయుల ప్రయోజనాలు కాపాడబడాలి..
Tuesday, November 1, 2016
రీల్ లైఫ్.. రియల్ లైఫ్
‘ కమల్ , గౌతమి విడిపోయారట కదా?..’
‘ అవునా?’
‘ అదేమిటి? మీకు తెలియకుండా ఎలా ఉంటుంది?’
‘ అయ్యో.. ఇప్పుడెలా మనకు ఎవరు వండి పెడతారు?’
‘ వాళ్లు మనకు వండి పెట్టడం ఎందుకు?’
‘ మరి వారు విడిపోతే మనకేం నష్టం లేనప్పుడు, నీవెందుకు అంత బాధ
పడుతున్నావ్?’
ఇక ఆ మిత్రుడు ఈ విషయంలో ఏమీ మాట్లాడలేక టాపిక్
మార్చాడు..
నిజానికి నేను కమల్ హాసన్ సినిమాలంటే చాలా
ఇష్టపడతాను.. ఆయన విలక్షణ నటనా శైలే అందుకు కారణం.. కమల్ అంటే నాకు వెర్రి అభిమానం
లేదు.. రియల్ లైఫ్, వేరు రీల్ లైఫ్ వేరు.. ఆ తేడా నాకు తెలుసు.. ఆయన వ్యక్తిగత జీవితం కూడా నాకు అనవసరం..
Subscribe to:
Posts (Atom)