ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడు.. జైలుకు
కూడా పోయొచ్చారు.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పని
చేశారు.. కేంద్ర మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా సేవలు అందించారు..
వయసు మీదపడి శరీరం సహకరించకున్నా
తివారీ సాగించిన విచ్చలవిడి శృంగారకాండకు ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ వేదికగా మారడం
పరాకాష్ట.. రోహిత్ కేసులో చేసిన తప్పును అంగీకరించడం చేతులు కాలాక ఆకులు
పట్టుకోడమే అయ్యింది.. రోహిత్ తన కొడుకు కాదని మొండిగా వాదించిన తివారీ, డీఎన్ఏ
టెస్టు ఫలితాన్ని కూడా వ్యతిరేకించారు.. కానీ నిజం నిప్పులాంటిదని నిరూపితమైంది..
ఇక్కడ తివారీ దొరికిపోయిన దొంగ.. కానీ
తివారీ లాంటి కామ పిశాచులు రాజకీయ నాయకుల్లో ఎందరో ఉన్నారు.. రాజకీయ నాయకులంతా
ఇంతే అని నేను వారిని కించపరచదలచుకోలేదు.. కానీ నిజాయితీ ఉన్నవారు అతి తక్కువ మందే
అనేది వాస్తవం.. తివారీ కేసు ప్రజాజీవితంలో ఉండి విచ్చలవిడి పనులు చేసేవారికి
కనువిప్పుగా మారాలని కోరుకుంటున్నాను..
No comments:
Post a Comment