Wednesday, April 24, 2013

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...................


పుస్తకం హస్త భూషణం

పుస్తకం హస్తభూషణం అంటారు మన పెద్దలు.. చిరిగిన చొక్కా అయినా ధరించు, మంచి పుస్తకం కొను అని సూచించారు.. ప్రపంచంలో జరిగే మార్పులు, ఆవిష్కరణలు, చరిత్రకు మూలాధారం పుస్తకమే..
సమాచార సాంకేతిక విజ్ఞానం విజృంభించిన ఈ రోజుల్లో పుస్తకానికి ప్రాధాన్యత తగ్గిందని.. టీవీలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చదువరులు తగ్గిపోయారని చాలా మంది భ్రమపడుతుంటారు.. కానీ ఇది పూర్తిగా అసత్యమని ఘంటాపధంగా చెప్పగలను..
పుస్తకానికి ప్రాధాన్యత తగ్గడమే నిజమైతే మన పుస్తక ప్రచురణ రంగం ఈ పాటికి దివాళా తీసి ఉండాలి కదా? ప్రతి నిత్యం కొత్తపుస్తకం, సాహిత్యం పుట్టుకొస్తూనే ఉంది.. ఏటా హైదరాబాద్ నగరంలో జరిగే పది రోజుల పుస్తక ప్రదర్శనకు వస్తున్న వేలాది మంది, అమ్ముడవుతున్న పుస్తకాల సంఖ్యను గమనించారా? అయితే మెరిసేవన్నీ రాళ్లు కానట్టే, అన్ని పుస్తకాలు అమ్ముడు కాకపోవచ్చు.. 


చివరగా రచయితలకు, ప్రచురణకర్తలకు నాదో మనవి.. పెరిగిపోతున్న ధరల ప్రకారం పుస్తకాల ధరలూ పెరగడం వాస్తవమే.. కానీ వీలైనంత తక్కువ ధరకు పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తీసుకురండి.. చదువున్న ప్రతి ఒక్కడూ ధనికుడు కాకపోవచ్చు.. సమాజంలో సాహిత్యం పట్ల అభిలాష ఉన్న డబ్బులకు ఇబ్బంది పడే చిరు ఉద్యోగులు, పేదల విషయం కూడా ఆలోచించండి.. తక్కువ ధరకు పుస్తకాలు తీసుకొస్తే, నాలాంటి వాడు మంచి పుస్తకాలు అధనంగా కొని ఇతరులకు బహుమతిగా ఇస్తాడు.. ఉదాహరణకు నేను గీతా ప్రెస్ వారి ప్రచురణలు తరచూ కొంటూ ఇతరులకు పంచుతుంటాను.. ఆధ్యాత్మిక సాహిత్యానికి సామాన్యులకు అందుబాటు ధరల్లో అందిస్తున్న గీతా ప్రెస్ వారు ఎంతో అభినందనీయులు..
అందరికీ ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు.. (23 ఏప్రిల్)

Sunday, April 21, 2013

ఇదేం 'చాకో'చక్యం?



2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి, ఆర్థిక మంత్రి చిదంబరం గారికి ఏ పాపమూ తెలియదట? టెలికాం మంత్రి రాజా ప్రధానిని తప్పుదోవ పట్టించారట.. యూపీఏ హయాంలో జరిగిన 2జీ స్కామ్ వల్ల ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్లు నష్టం వచ్చిందనేమాట శుద్ద అబద్దమట.. తప్పందా ఎన్డీఏ హయంలో ప్రధాన మంత్రిగా పని చేసిన వాజ్ పేయి, ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్, టెలికాం మంత్రులుగా పని చేసిన ప్రమోద్ మహాజన్, అరుణ్ శౌరీలదేనట.. వారు తీసుకున్న నిర్ణయాల వల్ల మైగ్రేషన్ విధానం వల్ల దేశ ఖజానాకు రూ. 43 వేల కోట్ల నష్టం వచ్చిందంట..  
ఇదండీ చాకోపాఖ్యానం.. 2జీ కుంభకోణంపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పీసీ చాకో సమర్పించిన నివేదిక సారాంశమిది.. 
ఈ దేశంలో టెలికమ్యూనికేషన్ విప్లవం వెల్లి విరియడానికి కారకులు ఎవరు.. కాల్ ఛార్జీ నిమిషానికి 16, 8 రూపాయల నుండి 1 రూపాయి దిగువకు తగ్గించి, సామాన్య ప్రజలకు సైతం మొబైల్ ఫోన్ అందుబాటులోకి తెచ్చిన ఘనత ఎవరిది? వాజ్ పేయి హయాంలో తీసుకున్న నిర్ణయాల పుణ్యమా అని దేశంలో సమాచార సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కి, కొత్తగా ఉన్నో ఉపాధి అవకాశాలు వచ్చాయి.. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడింది.. వాస్తవాలు ఇలా ఉంటే అటల్జీ, జస్వంత్, మహాజన్, శౌరీలపై బురద చల్లడం ఎందుకు? ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వారు అడ్డగోలుగా అవినీతికి పాల్పడి, ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు కూడబెట్టుకున్న ఆధారాలు ఏమైనా ఉన్నాయి..
 వెనుకటికి ఒకడు తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అని అడిగితే దూడ గడ్డి కోసం అన్నాడట.. చాకో గారి వ్యవహారం ఇలాగే ఉంది.. 2జీ స్కామ్ నిజాలు నిగ్గు తేల్చమంటే అసలు విషయం వదిలేసి, ప్రభుత్వ పెద్దలకు క్లీన్ చీట్ ఇచ్చేసి.. వెనుకటి ప్రభుత్వానికి మరకలంటించాడు.. రాజాగా గారే తప్పు మన్మోహన్జీకీ ఏ పాపమూ తెలియదు అంటే నమ్మేది ఎవరు? అత్యున్నత పదవిలో ఉండే వారు దేశ ప్రజల సొత్తును కాపాడాలే కాని దొంగలను వెనుకేసుకు వస్తారా?

Saturday, April 20, 2013

చైనా దురాక్రమణ

చైనా సైన్యం మన దేశంలోకి మరోసారి అక్రమంగా చొరబడింది.. లడఖ్ లోని దౌలత్ బేగ్ ఓల్డీలో ఏకంగా 10 కిలోమీటర్ల లోనికి వచ్చి సైనిక స్థావరం ఏర్పాటు చేసింది.. ఈ విషయాన్ని మన దేశం ఆలస్యంగా గ్రహించింది.. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత ప్రధానమైన ఈ వార్తకు మన మీడియా అంతగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు.. ఫలితంగా దేశ ప్రజలకు ఇదో చిన్న వార్తగానే కనిపించడం దురదృష్టకరం..
చైనా పట్ల మన దేశ విధానం మొదటి నుండీ వివాదాస్పదంగా ఉంది.. మనం హిందీ-చీనీ భాయి భాయి అని  ముచ్చట పడుతున్నాం.. కానీ చైనా మన పట్ల మొదటి నుండి శతృ వైఖరితోనే ఉంది.. భారత దేశ భూభాగాలపై దర్జాగా తిష్టేసినా శాంతి-చర్చలు అంటూ మన ప్రభుత్వం కాలాయాపన చేస్తోంది.. 1962లో మన దేశంపై ఏక పక్షంగా కయ్యానికి దిగి ఓడించినా మన పాలకులకు బుద్ధి రాలేదు..
ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, లడాఖ్ ప్రాంతాల్లోని భూ భాగాలకు మింగేసిన చైనా హిందూ మహా సముద్రంలో సైతం స్థావరాలు ఏర్పాటు చేసుకుంది.. శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, మాల్దీవులు, బంగ్లాదేశ్ దేశాలను తనవైపు తిప్పుకొని ఆ దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు తెరవేసింది..
పాకిస్తాన్ మనకు ఎంత శత్రువో, చైనా అంతకన్నా పెద్ద ప్రమాదకర శత్రువు.. దురదృష్టవశాత్తు మీడియా సైతం మన ప్రభుత్వాన్ని,  ప్రజలను అప్రమత్తం చేయలేకపోతోంది.. ఇప్పటికైనా చైనా విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి..

Thursday, April 18, 2013

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు..


తీవ్రవాదంపై పోరు ఇలాగేనా?..

హైదరాబాద్ బాంబు పేలుడు సంఘటనను మరవక ముందే తీవ్రవాదులు మరో సారి పేట్రేగిపోయారు.. ఈసారి బెంగళూరును టార్గెట్ చేసుకున్నారు.. బీజేపీ కార్యాలయం సమీపంలో జరిగిన ఈ పేలుడు మరోసారి దేశంలో ప్రకంపనలు సృష్టించింది.. 
తీవ్రవాదుల లక్ష్యం ఒకటే.. అమాయకులను చంపడం ద్వారా దేశ ప్రజలను భయకంపితులను చేయడం, దేశ సార్వభౌమత్వానికి సవాలుగా నిలచిన తీవ్రవాదంపై పోరులో పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు ఒక్కటిగా నిలవాల్సిన అవసరం ఉంది..
దురదృష్టవశాత్తు మన దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు తీవ్రవాద నిర్మూలనుకు ఆటంకంగా మారాయి.. ఉగ్రవాదానికి జాతి, మతం లేవని మన నాయకులు గొప్పలు చెబుతుంటారు.. కానీ వారిని అనచడానికి రూపొందించినటా టాడా లాంటి కఠిన చట్టాన్ని రద్దు చేసేశారు.. ఉగ్రవాదులకు ఉరి లాంటి కఠిన శిక్షలు విధించే విషయంలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారు.. 
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు విషయం ప్రస్థావించాడక మరొకడు.. అలాంటి ప్రబుద్దుడే షకీల్ అహ్మద్.. కేంద్ర మంత్రి పదవి వెలడబెడుతున్నఈ మూర్ఖుడు.. బెంగళూరు పేలుడు బీజేపీకి ఎన్నికల్లో లబ్ది చేకూరుస్తుందని ట్విట్టర్లో బాధ పడ్డాడు.. 
ఇలాంటి నేతాజీలకు సద్భుద్ధి కలగాలని కోరుకుంటున్నాను..

విపులాచపృథ్వి.............................................

హిమాచల్ రాష్ట్రాల మాజీ గవర్నర్, కేంద్ర ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్ వి.ఎస్.రమాదేవి ఇకలేరు అనే వార్త విచారాన్ని కలిగించింది.. జాతీయ స్థాయిలో అత్యున్నత పదవులు అలంకరించిన రమాదేవి గారు ఆంధ్రభూమిలో రాసే 'విపులాచపృథ్వి' కాలమ్ క్రమం తప్పకుండా చదివేవాన్ని.. రమాదేవి గారి మృతికి ప్రగాఢ సంతాపంతో..

Tuesday, April 16, 2013

గాడిదలూ తెలివైనవే..

మీరు కాకి దాహం కథ విన్నారా?..
అనగనగా ఓ కాకి.. ఆ కాకికి దాహమేసింది.. కుండ అడుగున నీళ్లున్నాయి..
ఇక చాలు ఈ కథ మాకు తెలుసులే అనుకుంటున్నారా?.. అయితే కాస్త భిన్నమైన కథ, నిఝంగా జరిగిన సంఘటన కళ్లారా చూడండి..
అనగనగా ఓ గాడిదల గుంపు.. అసలే వేసవి కాలం.. పాపం దాహంతో అలమటించి పోతున్నాయి.. ఎదురుగా బోరింగ్ ఉంది.. కానీ నీళ్లు కొట్టి ఇచ్చే వారెవరు?.. ఈ మనుష్యులను దేబరించే బదులు మనమే బోరింగ్ కొట్టుకొని తాగితే పోలా అనుకున్నాయా గాడిదలు.. అంతే రంగంలోకి దాగాయి.. 
 నోరు, మొహంతోనే బోరింగ్ కొట్టడం ప్రారంభించాయి.. అరగంట కష్టపడ్డ తర్వాత గంగమ్మ ఉబికి వచ్చింది.. కడుపారా నీళ్లు తాగాయి ఆ గాడిదలు..
చూశారా గాడిదల తెలివి.. తెలవి తేటలు మనుషులకేనా? గాడిదలకూ ఉంటాయని అర్థమైందా?
ఇకనైనా తోటి మానవులను తెలివి తక్కువ గాడిదా అని తిట్టకండి.. గాడిదలకూ తెలివి ఉంటుంది అని అర్థమైంది కదా?
ఇంతకీ ఈ సంఘటన జరిగింది ఎక్కడో తెలుసా?.. కర్నూలు జిల్లా
ఎమ్మిగనూరు తహశీల్దారు కార్యాలయ ప్రాంగణంలో.. 

Thursday, April 11, 2013

Monday, April 8, 2013

ఇతనేం మనిషి?

ఆయన అసలు మనిషేనా?.. మనవత్వం అనేది లేదా?
అజిత్ పవార్ అసలు అన్నం తింటారా?..
మరింకేమైనా తింటారా?.. అనే అనుమానం కలుగుతోంది..
తాగు నీరు, సాగు నీటి కోసం 55 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న భయ్యా దేశ్ ముఖ్ అనే రైతు గురుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎంత నీఛంగా మాట్లాడారో చూడండి..
ఈ అజత్ ఎవరో కాదు సాక్షాత్ కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ సోదరుని కుమారుడే.. రైతు బాధవునిగా ఫోజు కొడుతూ, రైతుల సంక్షేమం గురుంచి ఏమాత్రం పట్టించుకోని ఈ మహానుభావుడి దయవల్ల మహారాష్ట్రలో ఎందరో రైతులు కరువు కాటకాల భారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. పవార్ కుటుంబానికి రైతులపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో చూశారా?
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నోరు జారాక క్షమాపణలు కోరితే ఫలితం ఉంటుందా?.. ఇలా అయితే ప్రతి ఒక్కరూ నోరు పారేసుకొని క్షమించమంటారు.. ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలో ప్రజలే నిర్ణయించాలి..

Sunday, April 7, 2013

మనకు ఎవరు ఆదర్శం?..

ఆయన ఎప్పుడూ ఓటేయలేదట.. ఎన్నికలపై విశ్వాసం లేదట..
ఓటేయని వారికి వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే హక్కు లేదని ఆమె అంటోంది..
నిజమే ఓటేయని వ్యక్తి మన చట్ట సభల్లో మూడో వంత మంది నేర చరితులేనని ప్రకటించే నైతిక హక్కు ఎక్కడిది? ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును న్యాయమూర్తిగా వేతనంగా పొందిన మార్ఖండేయ కట్జూ గారు ఓటు హక్కును వినియోగించు కోకుండా, చట్టసభలకు మంచి వారు ఎన్నిక అయ్యే అవకాశాన్ని ఇవ్వకుండా వారిని నిందించడం ఎంత వరకూ న్యాయం? ప్రజాస్వామ్య మూల స్థంబాల్లో న్యాయ వ్యవస్థ, చట్టసభ, కార్యనిర్వాహక వ్యవస్థ ఉండగా మీడియాను నాలుగో స్థంబంగా (ఫోర్ట్ ఎస్టేట్)గా అభివర్ణిస్తారు.. కాని మార్ఖండేయుల వారు ప్రజాస్వామ్యంలోని న్యాయ వ్యవస్థలో ఉంటూ, అదే ప్రజాస్వామ్యంలోని చట్ట సభలను నిందించడం, ఓటేయనని చెప్పడం ఎంత వరకు సమంజసం..
కట్జూ గారు ఓటు పై తన అవిధేయతను చాటుకున్న మరునాడే భారతీయ అమెరికన్ వ్యోమగామి సునితా విలియమ్స్ 'ఓటు' హక్కుపై చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా జరిగిందే కావచ్చు.. కానీ కట్జూ లాంటి 'పెద్ద'లకు కనువిప్పుగా చెప్పుకోవచ్చు..
ఇప్పుడు చెప్పండి మనకు ఎవరు ఆదర్శం?.. మార్ఖండేయ ఖట్జూనా? సునితా విలియమ్సా?..

Monday, April 1, 2013

కొత్తగా ఫూల్స్ అయ్యేదేముంది..


ఏప్రిల్ ఒకటో తారీఖున మనం ఎవరినీ ఫూల్స్ చేయాల్సిన అవసరం లేదు.. మన పాలకులే మనందరినీ ఫూల్స్ చేసేశారు.. నమ్మి ఓటేసిన పాపానికి అసమర్థ, అవినీతి విధానాలతో మోసం చేశారు.. ప్రజలపై అన్ని విధాలా ఆర్థిక భారాన్ని మోపారు.. నిండా మునిగాక ఇక కొత్తగా మనకు మనం ఫూల్స్ అయ్యేది ఏముంది?..