‘రివర్స్ గన్’ అంటే మీకు తెలుసా?..
శత్రువులను కాల్చాల్సిన గన్ వెనక్కి పేలితే ఎలా ఉంటుంది?.. ప్రత్యర్థులకు అంతకన్నా
ఆనందం మరేమి ఉంటుంది.. మన యువరాజా చేసిన పని కూడా ఇదే..
జైలు శిక్షపడిన
ప్రజాప్రతినిధులు సభ్యత్వం కోల్పోకుండా యూపీయే ప్రభుత్వం తీసుకురా తలపెట్టిన
ఆర్డినెన్స్ విమర్శలకు దారితీస్తోంది.. బీజేపీ, వామపక్షాలు తీవ్రంగా
వ్యతిరేకిస్తున్న ఆర్డినెన్స్ ను స్వయంగా రాష్ట్రపతే తిరస్కరించారు.. ఈ దెబ్బ
నుండి కాంగ్రెస్ పార్టీ కోలుకోక ముందే మన ‘రివర్స్
గన్’ పేలింది.. ఇది నాన్సెన్స్ (అర్థం లేని) ఆర్డినెన్స్ అని
వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీ.. దీన్ని చించి పారేయాలని పిలుపునిచ్చారు.. అంతే కాదు
తన చేతిలోని కాగితాలను కసిగా చించేసి డెమో కూడా ఇచ్చారు.. ప్రధాని మన్మోహన్ సింగ్,
రాహుల్ తల్లి సోనియాగాంధీతో సహా కాంగ్రెస్ శ్రేణులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు ఈ
వ్యవహారంతో.. మొత్తానికి ఎవరిని కాపాడేందుకు ఈ వివాదాస్పద ఆర్డినెన్స్ తెస్తున్నారో
తెలియదు కానీ, ఇప్పట్లో ముందుకు సాగే అవకాశం లేకుండా పోవడం శుభ పరిణామమే..
No comments:
Post a Comment