Wednesday, February 28, 2018

కేజ్రీ పార్టీ గుండాయిజానికి పరాకాష్ట



రాజకీయాలను ఏదో ఉద్దరిస్తామని గద్దెనెక్కిన కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం సీటులో కూర్చున్నది మొదలు ఇప్పటి దాకా చేస్తున్న ఘనకార్యాలు ఏమిటో ఎన్నో చూశాం.. పరిపాలన గాలికి వదిలేసి నిత్యం కేంద్ర ప్రభుత్వంతో, లెఫ్టినెంట్ జనరల్ తో గిల్లి కజాలతో సరిపోతోంది.. ఆప్ ఎమ్మెల్యేలలో ఎక్కువగా నేర చరితులే ఉన్నారని రికార్డులు చెబుతున్నాయి.
 తాజాగా ఈ ఎమ్మెల్యేలు ఏకంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ పై చేయి చేసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వంలో చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు తత్కాలికం. కానీ అధికార యంత్రాంగం శాశ్వతం.. వీరిద్దరి మధ్య సయోధ్య ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయి. ఈ మాత్రం ఇంగితం మాజీ బ్యూరోక్రాట్ కేజ్రీవాల్ కు తెలియదని అనుకోలేం.. దేశ రాజధాని ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండటం సహజం.. దీన్ని అర్థం చేసుకోకుండా నిత్యం తగువులతోనే కాలం గడపడం, అధికారులను బెదిరించడం ఎంత వరకు సమంజసం? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినయోగం చేసుకోలేని ఈ పాపు(ఆప్)లను ఇలాగే భరించాల్సిందేనా?.. ఈ గుండా ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాల్సిన అవసరం ఉంది..
21.02.2018

జై భవానీ.. వీర శివాజీ.. ఛత్రపతి



 శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కొనసాగాలని ఆశిస్తూ..

19.02.2018

విద్యార్థులకు మోదీ చిట్కాలు



దేశవ్యాప్తంగా విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాసిన 'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకం విడుదలైంది..
విద్యార్థులు పరీక్షల సమయంలో వత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు.. ఏకాగ్రతను పెంచుకొని, చదువుపై దృష్టి పెట్టడం ఎలా అనే విషయాలను ప్రధాని ఈ పుస్తకంలో ప్రస్తావించారు.. క్రమశిక్షణ, సమయపాలనతో పాటు వత్తిడిని జయించేందుకు యోగ సాధన సూచించారు. పెంగ్విన్ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా చదవాల్సిన పుస్తకం ఇది..
18.02.2018

మూర అలీ జిన్నా

నటుడు ముదిరి రాజకీయం నేర్చాడు.. నాయకుని బినామీగా ఆస్తులు కూడ బెట్టాడు.. జనం ఓట్లతో చట్ట సభకు పోయాడు.. ఇప్పుడు దేశాన్ని విడగొడదామంటున్నాడు..
వెంచర్లు చేసి అమ్ముకోడానికి ఈ దేశం నీ రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు రా.. 'మూర్ అలీ జిన్నా'..


15.02.2018

అయ్యరోరు పాకీ భక్తుడు



పో.. పోరా.. అక్కడే చావు.. నీలాంటి మాతృదేశ ద్రోహుల కారణంగానే భారత్ ఇలా తయారైంది.. ఐఎస్ఐ ఏజెంట్లు ఎక్కడో లేరు.. అయ్యర్ లాంటి వారి రూపంలో దేశమంతా తగలడ్డారు..
14.02.2018

సైన్యంలో చేరతామంటే తప్పేముంది?



సుశిక్షితులైన సైనికుల్ని మూడు రోజుల్లోనే తయారు చేసి అందిస్తామని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ (ఆరెస్సెస్ చీఫ్) మోహన్ భగవత్ జీ చేసిన వ్యాఖ్యల్లో వివాదాస్పదం ఏముంది?.. ఆయన మాటలను అర్థం చేసుకోకుండా గుడ్డు మీద ఈకలు పీకే కామెంట్స్ ఎందుకు?..

దేశం కోసం ప్రాణాలర్పించేందుకు స్వయంసేవకులు ఎప్పటీ సిద్ధంగా ఉంటారని, సైనికుల మాదిరే స్వయం సేవకులు దేశభక్తి, క్రమశిక్షణతో శత్రువులతో పోరాడేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పడం సైన్యాన్ని అగౌరవ పరచడగమా?.. ఆర్మీకి సైనికులను తయారు చేయడానికి వారం రోజులు పడితే, ఆరెస్సెస్ కు మూడే రోజులు చాలు అన్నారు.. ఇందులో తప్పు ఏముంది?.. ఈ పని రాజ్యాంగం అనుమతిస్తేనే అని కూడా స్పష్టంగా చెప్పారు భగవత్ జీ.. వారికి ఉన్న కాన్ఫిడెన్స్ ను అభినందించడానికి ధైర్యం లేని వారు ఎన్నైనా కువిమర్శలు చేస్తారు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు..
భగవత్ జీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ అండ్ కో డిమాండ్ చేస్తోంది.. ఎందుకు చెప్పాలి క్షమాపణలు.. ఆయన తప్పు ఏమి మాట్లాడారని? కశ్మీర్ తో సహా దేశ సరిహద్దు వివాద సమస్యలకు కారణమైన మీ కుటుంబ మాత్రం దేశానికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదా?
దేశానికి స్వాతంత్ర్యం రావడంతో పాటు దేశ విభజన జరిగిన రోజుల్లో కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ నుంచి మానప్రాణాలు కోల్పోయి కట్టుబట్టలతో భారత్ కు వచ్చిన కోట్లాది మంది ప్రజల కన్నీరు తుడిచి ఆదుకున్నది ఎవరు?.. ముస్లింలీగ్ పార్టీ ప్రేరిత అల్లర్లు, మారణకాండ భారి నుంచి లక్షలాది మంది ప్రాణాలు కాపాడింది ఎవరు?.. మహారాజా హరిసింగ్ కశ్మీర్ భారత దేశంలో విలీనం చేయగానే పాకిస్తాన్ సైనిక మూకలు యుద్దానికి దిగినప్పుడు శ్రీనగర్ లో భారత సైన్యం దిగడం కోసం విమానాశ్రయాన్ని సిద్దం చేసింది ఎవరు?.. చైనా దురాక్రమ సమయంలో సైనిక, ఆయుధ పరంగా బలహీనంగా ఉన్న భారత సైన్యంలో అత్యవసరంగా చేరేందుకు ముందుకు వచ్చింది ఎవరు?.. అప్పటి వరకూ ఆరెస్సెస్ పై ఉన్న అపోహలు తొలగించుకున్న ప్రధాని నెహ్రూ కోరిక మేరకు ఆరెస్సెస్ స్వయం సేవకులు తొలిసారిగా గణతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కవాతు చేయడం వాస్తవం కాదా? ఇప్పుడు చెప్పండి ఎవరు క్షమాపణలు చెప్పాలి?
13.02.2018

Tuesday, February 27, 2018

Nation First అనేది మా నినాదం..

Nation First అనేది మా నినాదం.. Social media for Social Service అనేది మా విధానం.. సాధారణంగా సంస్థలు, విద్యాలయాలు వార్షికోత్సవాలు జరుపుకుంటాయి.. ఒక సోషల్ మీడియా గ్రూప్, అందునా వాట్సప్ గ్రూప్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అరుదైన విషయం..
రెండేళ్ల క్రితం ప్రారంభమైన We Can Change ఒక ప్రభావవంతమైన సామాజిక మాధ్యమంగా రూపుదిద్దుకుంది. దేశభక్తి, జాతీయవాదమే ఊపిరిగా సాగుతున్న WCC కేవలం ఒక చాటింగ్ గ్రూప్ కాదు.. సమాజంలో మార్పు, సేవ కోసం తన వంతు పాత్రను పోషిస్తూ ముందుకు సాగుతోంది.
We Can Change ద్వితీయ వార్షికోత్సవం ఒక వేడుకగా కాకుండా చర్చా గోష్టిగా నిర్వహించాం.. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ తెలంగాణ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, జాతీయ సాహిత్య పరిషత్ సంఘటనా మంత్రి భాస్కర యోగి గారు, భాజపా సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు హాజరై స్ఫూర్తిని నింపారు.. ఈ కార్యక్రమానికి హాజరైన, విజయవంతం చేసేందుకు కృషి చేసిన మిత్రులకు పేరు పేరునా ధన్యవాదాలు.. (11.02.2018)
ఫోటోల కోసం కింది లింక్ క్లిక్ చేయండి