Thursday, March 30, 2017
Saturday, March 25, 2017
హద్దు మీరిన కలెక్టర్
‘అడవి పంది మాసం, గొడ్డు మాంసం, కోతి మాంసం.. ఇలా అన్ని రకాల మాంసాలు
తినొచ్చు.. పూర్వం అన్ని రకాల మాంసాలు తినేవారు.. కానీ దరిద్రపు బ్రాహ్మిణికల్
కల్చర్ వచ్చాక ఆహార అలవాట్లు మారిపోయాయి.. దేవుని పేరిట పిచ్చి మాలలు వేస్తూ మాంసాలు
మానేస్తున్నారు.. గాడిద గుడ్డు..’ ఈ మాటలు ఏ దారిన పోయే దానయ్యో, మరే చవట సన్నాసో అని ఉంటే
పట్టించుకునేవాళ్లం కాదు.. కానీ బాధ్యతాయుతమైన కలెక్టర్ ఇలాంటి పిచ్చివాగుడు వాడగం
దారుణం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి నోట ఈ మాటలు వచ్చాయి..
సాంప్రదాయాలు, మనోభావాలను అవహేళన చేస్తూ, ప్రజల
మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేసిన ఈ కలెక్టర్ ను ప్రభుత్వం వెంటనే
తొలగించి చట్టప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉంది.. ఎవరి ఆహారపు అలవాట్లు,
విశ్వాసాలు వారివి.. ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. పందిని తింటాడో,
బర్రెను తింటాడో, కోతిని, కుక్కను, పిల్లిని, బల్లిని ఏదైనా తినమనండి పర్వాలేదు..
ఈ కలెక్టర్ నాస్తికుడో, అన్య మతస్తుడో, ఇంకెవడో నాకు అవసరం లేదు.. ప్రజల మత
విశ్వాసాలతో ఆడుకునే హక్కు ఇతగాడికి ఎవరు ఇచ్చారు?
Wednesday, March 22, 2017
ఎప్పటికీ పాజిటివ్ ఆలోచనలే..
' మీ పోస్టులు చాలా పాజిటివ్..'
' యస్.. '
'ఎందుకలా?'
' నా రక్తంలోనే పాజిటివ్ ఉంది..'
' ఎలా? '
' బీ పాజిటివ్.. థింక్ పాజిటివ్.. పాజిటివ్ మైండ్.. పాజిటివ్ లైఫ్.. టోటల్లీ.. అయామ్ ఆల్వేస్ పాజిటివ్..'
ఒక ఫ్రెండ్‌తో నా సరదా సంభాషణ ఇది.. అన్నట్లు B+ గ్రూప్ రక్తం అవసరమైనవారు నన్ను సంప్రదించవచ్చు..
' యస్.. '
'ఎందుకలా?'
' నా రక్తంలోనే పాజిటివ్ ఉంది..'
' ఎలా? '
' బీ పాజిటివ్.. థింక్ పాజిటివ్.. పాజిటివ్ మైండ్.. పాజిటివ్ లైఫ్.. టోటల్లీ.. అయామ్ ఆల్వేస్ పాజిటివ్..'
ఒక ఫ్రెండ్‌తో నా సరదా సంభాషణ ఇది.. అన్నట్లు B+ గ్రూప్ రక్తం అవసరమైనవారు నన్ను సంప్రదించవచ్చు..
Sunday, March 19, 2017
యోగికి రాజయోగం
అజయ్ సింగ్ నేగి.. 1972 జూన్ 5వ తేదీన పౌరీ
గడ్వాలీ జిల్లా (ఉత్తరాఖండ్)లోని పంచూర్ గ్రామంలో జన్మించారు.. హెచ్‌ఎన్‌బీ గర్వాల్ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా పొందారు.
హిందూ యువ వాహినిని స్థాపించారు. 12వ లోక్‌సభలో 26 ఏళ్ల పిన్నవయస్కుడైన ఎంపీగా
రికార్డు సృష్టించారు. 1998 నుంచి వరుసగా ఐదుసార్లు గోరఖ్‌పూర్
నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యోగి ఆదిత్యనాథ్ గురుంచి సంక్షిప్త పరిచయం ఇది..
సన్యాస ధర్మాన్ని
పాటిస్తున్న యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ మఠాధిపతిగా కూడా ఉన్నారు.. ఉత్తరప్రదేశ్
ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు..రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ఆదిత్య
నాథ్ ఏమి మాట్లాడినా సంచలనమే.. ఆయననను కరడు గట్టిన హిందుత్వ వాది అంటారు.. కానీ
యోగి ఆదిత్య నాధ్ మెజారిటీ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్నారు అన్న
విషయాన్ని మరచిపోరాదు..
ఆయన యోగి.. ఇప్పుడు రాజయోగి అయ్యారు..
రాజధర్మాన్ని పాటించడం ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ విధి.. ఉత్తరప్రదేశ్ ప్రజలు అఖండ
మెజారిటీ ఇచ్చి బీజేపీని గెలిపించారు.. దేశంలోనే పెద్దదైన ఈ రాష్ట్రానికి
ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం యోగి ఆదిత్యనాథ్ కు కత్తిమీద సాములాంటిదే.. పేదరికం,
అత్యాచారాలు, గుండాయిజం, అవినీతి, ఆరాచకం రాజ్యమేలుతున్న యూపీని గాడిలో
పెట్టాల్సిన బాధ్యత ఆదిత్యనాథ్ పై పడింది.. ఆయన చేతితో ఉన్నది మంత్రదండం కాకపోవచ్చు..
కానీ రాజదండంతో అన్నింటినీ సరిదిద్దగలనే నమ్మకం నాకుంది..
Thursday, March 16, 2017
వామ్మో పెద్దొర!
'ఇచ్చేస్తున్న.. ఇక తీసుకోండి..'
పెద్దొర ఉదారత చూపించాడు.
'అన్నా.. మీరు దేవుడన్నా.. ఈ సాయం మరచిపోలేం.. మీ పేరు చెప్పుకొని బతుకుతాం..'
అంటూ జేజేలు కొడుతూ, దండాలు పెట్టుకొని వెనుదిరిగారు అమాయకులు.
'సార్..ఇలా అయితే కష్టం.. అందరికీ ఉదారంగా ఇస్తూ పోతే ఎలా?..'
చెవిలో గొణిగాడు పెద్దాఫీసర్.
'ఏమయ్యా.. నేనేమన్నా పిచ్చోనిలా కనిపిస్తున్ననా?.. దీన్ని అడ్డుకోవడానికి ఎవరూ లేరనుకున్నవా ఏంటి..'
పెద్దొర అన్నమాట అర్థంకాక బుర్ర గోక్కున్నాడు పెద్దాఫీసర్.
'ఇగో దానయ్యా.. ఇక చూస్కోపో..'
పెద్దొర అదేశంతో కోర్టుకు బయలు దేరాడు దానయ్య..
అవాక్కవడం పెద్దాఫీసర్ వంతయింది..
పెద్దొర ఉదారత చూపించాడు.
'అన్నా.. మీరు దేవుడన్నా.. ఈ సాయం మరచిపోలేం.. మీ పేరు చెప్పుకొని బతుకుతాం..'
అంటూ జేజేలు కొడుతూ, దండాలు పెట్టుకొని వెనుదిరిగారు అమాయకులు.
'సార్..ఇలా అయితే కష్టం.. అందరికీ ఉదారంగా ఇస్తూ పోతే ఎలా?..'
చెవిలో గొణిగాడు పెద్దాఫీసర్.
'ఏమయ్యా.. నేనేమన్నా పిచ్చోనిలా కనిపిస్తున్ననా?.. దీన్ని అడ్డుకోవడానికి ఎవరూ లేరనుకున్నవా ఏంటి..'
పెద్దొర అన్నమాట అర్థంకాక బుర్ర గోక్కున్నాడు పెద్దాఫీసర్.
'ఇగో దానయ్యా.. ఇక చూస్కోపో..'
పెద్దొర అదేశంతో కోర్టుకు బయలు దేరాడు దానయ్య..
అవాక్కవడం పెద్దాఫీసర్ వంతయింది..
Friday, March 10, 2017
ఇలా చేస్తే నగదు కష్టాలే ఉండవు..
ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేతంగా చేపట్టిన డీమానిటైజేషన్ కార్యక్రమంతో దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందనడంలో ఏ మాత్రం అనుమానం లేదు.. కానీ కొందరు అధికారుల అనాలోచిత విధానాల కారణంగా ఈ ఫలాలు ప్రజలకు అందని పరిస్థితి ఏర్పడింది.. కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి..
పెద్ద నోట్ల రద్దు పుణ్యం వల్ల వచ్చిన తాత్కాలిక కష్టాల పుణ్యమా అని ప్రజల్లో పొదుపు శక్తి పెరిగింది.. కానీ కొన్ని బ్యాంకుల దివాళాకోరు చర్యలు ఖాతాదారుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.. నగదు నిల్వ, లావాదేవీలపై అడ్డగోలు ఛార్జీల కారణంగా వేతన జీవులు జీతం పడగానే దాదాపుగా ఊడ్చేసుకుంటున్నారు.
గతంలో రూ.1000 ఉంటే ఎంతో ధీమా.. ఇప్పుడు అది పోయి రూ.2000, కొత్త రూ.500 నోట్లు వచ్చాయి.. రూ.2000 నోటు దైనందిన లావాదేవీలకు పెద్ద గుదిబండగా మారింది. చిల్లర కష్టాల కారణంగా దాన్ని భద్రంగా ఇళ్లలోనే దాచుకుంటున్నారు.. అదే సమయంలో రూ.500ను ఆచితూచి ఖర్చు చేస్తున్నారు..
ఈ కారణాల వల్లే పాత రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ విడుదల చేసిన కొత్త నోట్లు ప్రజల దగ్గర నుండి తిరిగి బ్యాంకులకు చేరడం లేదు.. ఫలితంగా ఏటీఎంలు, బ్యాంక్ కౌంటర్లు క్యాష్ లెస్ అయిపోయాయి..
ఇప్పుడు తక్షణం చేయాల్సిన పనులు ఇవి..
1 ముందు బ్యాంకులు అడ్డగోలు ఛార్జీలను ఎత్తేసి పొదుపు, లావాదేవీలను ప్రోత్సహించాలి..
2 ఆర్బీఐ మార్కెట్లోకి అత్యవసరంగా కొత్త రూ.1000 నోటును విడుదల చేయడంతో పాటు, రూ.100 రూ.50, రూ.20, రూ.10 రూపాయల చలామాణిని విస్తృతంగా పెంచాలి..
3 నగదు రహిత లావాదేవీలపై ప్రజలను చైతన్య వంతం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బ్యాంకులు, వాణిజ్య సంస్థలు విస్తృత ప్రచారం చేయాలి.. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లపై ప్రోత్సాహకాలను పెంచాలి..
ఇవన్నీ కచ్చితంగా పాటిస్తే మన ఆర్థిక రంగం మరింత బలోపేతం కావడమే కాదు, నల్లధనం సమస్యే ఉండదు..
Subscribe to:
Posts (Atom)






