పాకిస్థాన్ రక్షణ మంత్రి క్వాజా మహ్మద్ ప్యాంట్ జారి పోయింది.. వాస్తవానికి ఈ ఘటన రెండు నెలల క్రితమే జరిగింది.. కానీ భారత్ చేతిలో పాకిస్థాన్‌కు వరుసగా భంగపాట్లు ఎదురవుతున్న దశలో సోషల్ మీడియాలో ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది.. ఉరీ ఘటనకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది.. ఈ నేపథ్యంలో ప్యాంట్ ఊడటంపై వ్యంగ్యాస్థ్రాలు కుచ్చకుంటున్నాయి పాక్ పాలకులకు.. ఎప్పుడైతేనేం మొత్తానికి జారిపోతున్నాయి.. ప్యాంట్ ఊడటమే కాదు.. పైజామాలు కూడా తడుపుకుంటున్నారట..
Friday, September 30, 2016
Thursday, September 29, 2016
పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం
కరిచింది పిచ్చికుక్కే కదా అని తేలికగా వదలొద్దు..
దుడ్డకర్ర తీసుకొని గట్టిగా ఒక్కటిచ్చుకోవాల్సిందే.. లేకుంటే మన సహనాన్ని
పిరికితనంగా భావించే అవకాశం ఉంది..
ఉరీలో భారత సైనిక స్థావరంపై పాకిస్థాన్ ప్రేరిత
ఉగ్రవాదుల దాడి తర్వాత దేశ ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు.. పాకీలపై ప్రతికారం
తీర్చుకోవాల్సిందే నినదించారు.. భారత సైన్యం అదను చూసి పాకిస్థాన్ కు గట్టి బుద్ధి
చెప్పింది.. సర్జికల్ ఆపరేషన్ పేరుతో ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిక్షణ
శిబిరాలపై మెరుపు దాడి జరిపి 9 మంది పాకిస్థాన్ సైనికులను. 38 మంది ఉగ్రవాదులను
మట్టుబెట్టింది..
మంచితనం అన్ని వేళలా పనికి రాదు.. శత్రువు మంచి
తనాన్ని కూడా బలహీనతగా భావిస్తాడు.. పదే పదే కవ్వించేవారికి గూబ పడిలేలా గట్టి
జవాబు చెప్పాల్సందే.. ఇప్పుడు భారత సైన్యం చేసింది ఆ పనే..
Wednesday, September 28, 2016
మూసీ ప్రళయ రూపం.. భాగ్యనగర విషాదం
28 సెప్టెంబర్, 1908.. భాగ్యనగర
చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఇది.. ఆ రోజు తెల్లవారు ఝాముకు ముందే భారీ జల
ఖడ్గం విరుచుకుపడింది.. కారు చీకటి వేళ 15 వేల మందికి పైగా తుడుచుకు పోయారు.. 80
వేల మంది నిరాశ్రయులుగా మారారు.. అంతటా ఆక్రందనలు..
రెండు
మూడు రోజులుగా మేఘాలు బద్దలై నేలపై పడ్డాయా అన్నంత భయంకరమైన వర్షం.. వికారాబాద్
సమీపంలోని అనంతగిరి కొండల నుండి దూకిన మూసీనది ఉగ్ర రూపం దాల్చింది.. జోరు
వర్షాలకు చెరువులను గండ్లుపడి నదిలోకి వరద నీరు ప్రవహించింది.. ఉప్పొంగిన మూసీ
భారీ ప్రవాహ రూపంలో హైదరాబాద్ ను ముంచెత్తింది. మూడో వంతు నగరం గల్లంతైపోయింది..
నిద్రలోనే ఎంతో మంది విగత జీవులైపోయారు.. చిమ్మ చీకటిలో ఎటు చూసినా జల ప్రవాహం.. అయిన
వారు కళ్ల ముందు కొట్టుకుపోతున్నా రక్షించలేని దుస్థితి.. ఇళ్లూ, వాకిలి,
ఆస్తిపాస్తులు గల్లంతు.. మూసీ నది సాధారణ స్థితికన్నా 40 50 అడుగుల ఎత్తు
ప్రవహించింది.. నగరంలోని నాలుగు వంతెనలు మునిగిపోయాయి.. పురానాపూల్ మాత్రమే
భద్రంగా ఉంది.. అఫ్జల్ గంజ్ వంతెన కొట్టుకుపోయింది.. ముసల్లంజంగ్, చాదర్ ఘాట్
వంతెనలు దెబ్బతిన్నాయి.. ఎటు చూసినా బురద రాళ్ల మేటలు, కొట్టుకువచ్చిన శవాలు,
కూలిన ఇండ్లూ, భవనాల శిథిలాలు.. జనం ఆహాకారాలు, రోదనలు.. ధనికులు, పేదల అంతరం
తెలియని విషాద ఘటన అది..
మూసీ
ప్రళయం చూసి హైదరాబాద్ పాలకుడు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ చలించిపోయాడు.. ప్రజలకు
కలిగిన కష్టం చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.. కుండపోత వర్షంలో ఏనుగుపై తిరుగుతూ జనం
దగ్గరకు వెళ్లి ఓదార్చాడు.. నిరాశ్రయులకు తన అధికార నివాసం పురాణా హవేలీ ప్రాంగణంలో
రోజుల తరబడి వసతి భోజన, వస్త్ర సౌకర్యాలు కల్పించాడు.. మహబూబ్ అలీఖాన్ దగ్గరిండి
మరీ సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించాడు..
ఉగ్రరూపంలో
ఉన్న మూసీ శాంతించాలంటే ఏమి చేయాలని ప్రధానమంత్రి మహారాజా కిషన్ పర్షాద్ ను అడిగాడు
నిజాం నవాబు.. నది వరద తగ్గాలంటే ఏమి చేయాలని అడిగాడు.. ఆయన సలహా ప్రకారం వెండి
పల్లెంలో పట్టుచీర, కుంకుమ పసుపు, ప్రమిదలతో నదీమ తల్లికి హారతి సమర్పించాడు..
మూసీ వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది..
హైదరాబాద్
చరిత్రను గమనిస్తే మూసీనదికి 12 సార్లు భయంకరమైన వరదలు వచ్చాయి.. ఇందులో 1631,
1831, 1908 సంవత్సరాల్లో వచ్చిన వరదలు అత్యంత ప్రమాదాన్ని మిగిల్చాయి.. 1903లో
కూడా ఒక మోస్తరు పెద్ద వరదే వచ్చింది.. 1831లో హైదరాబాద్ వచ్చిన ఏనుగుల వీరాస్వామయ్య
తన కాశీయాత్ర చరిత్రలో ఆనాటి వరద పరిస్థితిని ఉల్లేఖించాడు.. ఆధునిక కాలంలో వచ్చిన
1908 మూసీ వరద తాలూకు చేదు గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి.. ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోని
భారీ చింత చెట్టుకు పైకి ఎక్కిన 150 మంది తమ ప్రాణాలను కాపాడుతున్నారు..
మూసీనదికి
భవిష్యత్తులో ఇలాంటి వరదలు రాకూడదని భావించారు మీర్ మహబూబ్ అలీఖాన్.. ప్రఖ్యాత
ఇంజినీరు మోక్షగుండం విశ్వేశయ్యను హైదరాబాద్ రప్పించారు.. ఆయన సలహా మేరకు మూసీనది,
దాని ఉపనది ఈసీపై ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ ఆనకట్టలను కట్టించారు.. మూసీ నది
తీరం వెంట పెద్ద ఎత్తున గోడలు నిర్మించారు.. ఈ పనులు ఏడో నిజాం మీర్ ఉస్మాన్
అలీఖాన్ హయాంలో పూర్తయ్యాయి..
ఒకనాడు
ఉదృతమైన ప్రవాహంతో, నౌకాయానంతో కళకళలాడింది మూసీ.. ఈ నదీ తీరమంతా పచ్చని ఉద్యానవనాలు,
పంట పొలాలతో కనిపించేది.. కానీ అదంతా గతం.. కాలక్రమంలో మూసీ ఒక డ్రైనేజీ స్థాయికి
దిగజారిపోయింది.. జీవనది స్థాయిని కోల్పోయింది.. కబ్జాలతో కుందించుకుపోతోంది.. ఇప్పుడు
మూసీ ధీన స్థితిని చూస్తే జాలేస్తోంది.. నదిని రక్షించుకోవాల్సిన తక్షణ కర్తవ్యం
మనపై పడింది..
Sunday, September 25, 2016
విశ్వ నగరం తీరు ఇలాగేనా?
‘అందరూ శాఖాహారులేనట.. కానీ బుట్టెడు రొయ్యలు మాయం..’
హైదరాబాద్
నగరాన్ని మరోసారి వరదలు ముంచెత్తాయి.. ఇది కొత్తేంకాదు.. ఊహించనిది అంతకన్నా
కాదు.. లోతట్టులో ఉన్న బస్తీలు, కాలనీలు నీట మునిగాయి.. నాలాలు, చెరువులు
ఉప్పొంగాయి.. ఇళ్లు, అపార్టుమెంటుల్లోకి నీరు చేరింది.. రోడ్లు కాలువలుగా మారిపోయి
ఎక్కడ ఏ గొయ్యి ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది..
‘వరద’ ముప్పు నుండి హైదరాబాద్ బయట పడక ముందే ‘బురద’ చల్లుకొనుడు మొదలైంది.. ఈ పాపం మీదంటే మీదంటూ రాజకీయుల
పరస్పర విమర్శలు, సోషల్ మీడియాలో వారి ఫాలోవర్ల సెటైర్లు.. కానీ తిలాపాపం తలా పిడికెడు
అనే నిజాన్ని మరచిపోతున్నాం..
నగరంతో
పాటు పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు 500కు పైనా జలాశయాలుండేవి.. చెరువులు, కుంటలు,
వాగులు, కాలువలు, బావులు, తోటలతో చూడ ముచ్చటగా ఉండేది భాగ్యనగరం.. మరి ఏమయ్యాయి ఇవన్నీ..
నేటి పాలకులకు, పౌరులకు వాటి గురుంచి ఏమైనా అవగాహన ఉందా? విచ్చల విడిగా కబ్జాలు
చేసి, పూడ్చేసి, అమ్మేసుకుంటే ఇంకెక్కడి చెరువులు, నాలాలు?..
‘నీళ్లు పల్లమెరుగు’.. దానికి ధర్మం ప్రకారం అది
ప్రవహిస్తుంది.. భాగ్యనగరంలోని చెరువులన్నీ కాలువలతో అనుసంధానమై గొలుసుకట్టుగా
ఉంటాయి.. వర్షం నీరు, వరదతో వరుసగా నిండుతాయి.. అధిక జలాలు మూసీ నదిలోకి
వెళ్లిపోతాయి.. కానీ వాటి సహజ స్థావరాలను దర్జాగా కబ్జా చేసేస్తే ఎక్కడికి పోతాయి
ఆ ప్రవాహాలు.. వాటి స్థలాలకు అవి వస్తున్నాయి.. అక్కడ ఉంటున్న మన జనాలకే అంతిమ
నష్టం.. కబ్జాలు చేసి అమ్మినోళ్లు, వారికి అండగా ఉన్న నాయకులు, దళారులు వారి
వాటాలతో వారు హాయిగా జీవిస్తున్నారు.. కానీ కొన్నవారు, అక్కడ నివసిస్తున్న వారే
అంతిమంగా నష్టపోతున్నారు..
హైదరాబాద్
నగరానికి ఏర్పడ్డ ఈ దుస్థితికి పరస్పరం నిందించుకుంటున్నాయి రాజకీయ పార్టీలు..
కానీ ముసుగులు తీసి గుద్దులాటలు ఆపేస్తే ఎవరు ఏమిటనేది జనాలకే అర్థం అవుతుంది..
ఇక్కడ ఎవరూ సుద్దపూసలు కాదు.. అత్యధిక కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ
కాలంలో సగానికి పైగా జలాశయాలు మాయమయ్యాయి.. నాలాల వెంట నివాసాలు వచ్చింది ఈ
కాలంలోనే.. ఇక తెలుగు దేశం వారు ఏమీ తక్కువ తినలేదు.. అధికారంలో ఉన్నంత కాలం
హైదరాబాద్ కు మేకప్పులు వేసి, లిప్ స్టిక్కులు పూసి తామే ఈ నగరాన్ని
నిర్మించామన్నంత గొప్పలు చెప్పుకున్నారు.. కానీ ఏనాడూ చెరువుల కబ్జాలు,
డ్రైనేజీలు, నాళాల దుస్థితి మీద దృష్టి పెట్టలేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి
రెండేళ్లు గడచిపోయింది.. కానీ టీఆర్ఎస్ ఇంకా గత పాలకులనే నిందిస్తోంది..
హైదరాబాద్
నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే తపన సరే.. కానీ నగరం రోడ్లు, డ్రైనేజీల
నిర్వహణ సంగతి గాలికి వదిలేస్తే ఎలా? ఈ వర్షాకాలం భారీ వర్షాలు పడతాయని ముందుగా
ఊహించిందే.. కానీ డ్రైనేజీలు, నాలాల్లో ముందుగా ఎక్కడా పూడిక తీయలేదు.. రోడ్ల మీద
నీరు నిల్వ ఉండే పాయింట్స్ అందరికీ తెలిసినవే.. కనీసం అక్కడ కాస్త గట్టి రోడ్డు
వేసే పని కూడా చేయలేదు.. మెట్రో రైలు లైన్ నిర్మాణ మార్గాల్లో విస్తరణ పనులు
పూర్తి చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు దారుణంగా మారాయి.. నగరం ఇంతటి దుస్థితిలో
ఉండటానికి కారకులైన వారిలో చాలా మంది ఇప్పుడు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు.. వారు
కూడా ఇప్పుడు సుద్దులు చెప్పుతున్నారు..
విమర్శలను పక్కన పెట్టి తక్షణం చేయాల్సిన పనులు కొన్ని
ఉన్నాయి.. ముందుగా కబ్జాకు గురైన చెరువులను గుర్తించాలి.. అక్కడ ఉన్న వారిని ఖాళీ
చేయించడం ఇప్పుడు కష్టమే.. అక్కడ నీరు చేరే అవకాశం లేకుండా కొత్తగా డ్రైన్లను
నిర్మించాలి.. చెరువులు, నాలాల వెంట ఉన్న నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా
తొలగించాలి.. వాటి చుట్టూ చక్కని పార్కులు నిర్మించి కాపాడాలి.. నగరంలో రోడ్లన్నీ
తక్షణం సీసీ రోడ్లుగా మార్చేయాలి.. మళ్లీ మళ్లీ తవ్వే అవకాశం లేకుండా ముందుగానే
శాశ్వత డ్రైనేజీ, కేబుల్ డక్ట్ లైన్లు వేయాలి.. అన్నింటికన్నా ముందుగా మెట్రోరైలు
మార్గంలో ట్రాఫిక్ సక్రమంగా సాగేందు కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న కట్టడాలను
నిర్ధాక్షిణ్యంగా తొలగించాలి.. భాగ్యనగరాన్ని నిజంగా విశ్వనగరంగా మార్చేందుకు ఇవే
తొలిమెట్లు..
Thursday, September 22, 2016
Wednesday, September 21, 2016
Tuesday, September 20, 2016
దండం దశగుణం భవేత్..
పాకిస్థాన్
మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. మతం ఆధారంగా భారత్ నుండి విడిపోయింది పాక్.. అంతటితో
సరిపుచ్చుకోకుండా నిరంతరం మన దేశంలో అశాంతిని రగిలిస్తూ రాక్షసానందం పొందుతున్నారు
అక్కడి పాలకులు..
భారత
దేశంతో జరిగిన 1947, 1965, 1971, 1999 యుద్ధాల్లో ఘోర పరాజయం పొందింది వారికి
బుద్ధి రాలేదు.. 1947లో కాశ్మీర్ లో చొరబడిన పాక్ మూకలను పూర్తిగా తరిమి కొట్టక
ముందే ప్రధాని నెహ్రూ తొందరపాటుతో ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించారు.. అప్పటి నుండి
సగం కాశ్మీర్ (పీవోకే) ఇంకా పాక్ కబ్జాలోనే ఉంది.. 1965లో భారత సైన్యం లాహోర్ దాకా
చొచ్చుకుపోయి మన జాతీయ పతాకాలను సగర్వంగా ఎగురవేసింది.. కానీ మన ప్రభుత్వ ఆదేశాలతో
తిరగి వచ్చేసింది.. 1971లో తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్)ను కోల్పోయినా ఆ
దేశానికి బుద్ది రాలేదు.. 1999 కార్గిల్
యుద్దంలోనూ మనదే పై చేయి..
ప్రత్యక్ష
పోరాటంలో గెలవలేక పరోక్షపద్దతిలో ఉగ్రవాదలను ప్రోత్సహిస్తోంది.. ముంబై మారణకాండ,
పార్లమెంటుపై దాడి, సరిహద్దుల్లో చొరబాట్లు-కాల్పులు, ఆర్మీ క్యాంపులపై
దాడుల వెనుక పాకిస్థాన్ ఉందని జగమెరిగిన సత్యమే అయినా తమకు సంబంధం లేదని
బుకాయించడం వారికి అలవాటైపోయింది.. పాకిస్థాన్ తో శాంతి కోసం ఎన్ని చర్చలు జరిపినా
బూడిదలో పోసిన పన్నీరే.. స్నేహ హస్తం అందించి వెన్నుపోటు పొడవడం ఆ దేశ పాలకులకు
వెన్నతో పెట్టిన విద్య..
యూరిలో
జరిగిన ఘటనపై దేశ ప్రజలంతా ఉడికిపోతున్నారు.. ఈ సమయం పాకిస్థాన్ తిరిగి కోలుకోలేని
రీతిలో గుణపాఠం చెప్పడం తప్పని సరి.. ముందుగా మనం పాకిస్థాన్ లోని ఉగ్రవాద
స్థావరాలపై భారీ దాడులు చేయాలి.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలి..
దౌత్య మార్గంలో పాకిస్థాన్ కపట నీతిని ప్రపంచ దేశాలకు వివరించాలి.. అన్నింటికన్నా
ముఖ్యం బలూచిస్థాన్ తిరుగుబాటుదారులకు నేరుగా సహకారం అందించాలి.. అప్పుడు
పాకిస్థాన్ మాత్రమే కాదు, మన దేశంలో ఉన్న వారి తొత్తులు కూడా దారికి వస్తారు..
Subscribe to:
Posts (Atom)






