Wednesday, May 7, 2014

బాధ్యతాయుత పార్టీలకే ఓటు..

సీమాంధ్ర మిత్రులకు శుభోదయం..
రాష్ట్ర విభజన ప్రక్రియ తర్వాత కీలకమైన ఎన్నికలు ఇవి.. అవశేష ఆంధ్రప్రదేశ్ గా పిలుస్తున్నా, నిజానికి తెలంగాణ మాదిరిగానే సీమాంధ్ర కూడా కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించినట్లే భావించొచ్చు..
ఈ కీలక పరిస్థితుల్లో మీ ఓటు పైనే భవిష్యత్తు ఆధారపడి ఉండి.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సీమాంధ్రకు ఎన్నో సమస్యలు ఎదురుకానున్నాయి.. వీటన్నిటినీ అధిగమించే సత్తా ఉన్న పార్టీకి, నాయకునికి పట్టంకట్టాల్సిన అవసరం ఉంది.. తాత్కాలిక ప్రలోభాలకు లొంగితే దోపిడీ దార్ల పాలన వస్తుందని మీ అందరికీ తెలుసు..
సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వం, కేంద్రంలో ఏర్పడనున్న ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరపడం తప్పని సరి.. రెండింటి మధ్య సమన్వయం లేకపోతే నష్టపోయేది ప్రజలే.. ఈ నేపథ్యంలో మనం జాతీయ దృక్ఫధంతో కూడా ఆలోచించాలి.. పార్లమెంటుకు, అసెంబ్లీని ఓటు వేసే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి..
తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతను సృష్టించి పబ్బం గడుపుకునే పార్టీల వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.. రెండు ప్రాంతాల మధ్య భవిష్యత్తులో సమన్వయం అవసరం.. ఇరు రాష్ట్రాలను ప్రభావితం చేసు ఉమ్మడి సమస్యలు ఎన్నో ఉన్నాయి..
భాద్యతాయుతమైన ప్రభుత్వాల వల్లే పురోభివృద్ధి సాధ్యమవుతుంది.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నాను..

Monday, May 5, 2014

ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు?

అమేథీ ఎన్నికల ప్రచారంలో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగం..
కాంగ్రెస్, బీజేపీలు మా పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుమ్మక్కయ్యాయి.. వారణాసిలో నరేంద్ర మోదీపై పోటీ చేస్తున్న నాపై కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు.. అమేథిలో రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న మా అభ్యర్థి కుమార్ విశ్వాస్ కు బీజేపీ మద్దతు ఇవ్వకుండా ఎందుకు పోటీ చేస్తుంది.. వారణాసిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నరేంద్ర మోదీ.. అలాగే అమేథీలో కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి రాహుల్ గాంధీ..

ఈ ప్రసంగం మీకు అర్థమైందా?.. గందరగోళంగా ఉందా?.. థట్స్ గజిబిజీ వాలా..

Sunday, May 4, 2014

నమో పెన్ డ్రైవ్..

నరేంద్ర మోదీ క్రేజీని వ్యాపారులు ఎలా సొమ్ము చేసుకుంటున్నారో చూడండి.. ఉత్తరాదిన కొన్ని హోటళ్లలో నమో థాలీల గురుంచి విన్నాం.. అలాగే నమో మొబైల్ ఫోన్లు కూడా వచ్చాయి.. ఇప్పుడు నమో పెన్ డ్రైవ్ లు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి.. డిమాండ్ ఉన్న సరుకుకే గిట్టుబాటు కదా..

Saturday, May 3, 2014

ఇదేం సంస్కారం?..

బస్సులో తమకు కేటాయించిన ముందు సీటులో కూర్చున్నాడో వృద్దుడు..
సీటు కోసం వెతుకుతున్న యువతిని  చూసి, ఇక్కడ కూర్చోమ్మా అని కోరాడు.. ఆమె తటపటాయించింది.. 
పరవాలేదమ్మా నేను నీ తండ్రిలాంటి వాన్ని అన్నాడా వృద్దుడు.. 
ఆ అమ్మాయి చిరు నవ్వుతో వెంటనే ఆ సీటులో కూర్చుంది..
మన దేశంతో పాటు చాలా దేశాల్లో  పెద్దవారు తమకు రక్త సంబంధం లేకున్నా చిన్న వారిలో తమ కూతురునో, కొడుకునో, మనవళ్లనో చూసుకోవడం సహజం.. 
కాని ఆ యువతి స్థానంలో ప్రియాంక వాద్ర ఉన్నుంటే?.. 
నున్ను నాకు తండ్రివా.. నేను నీకు కూతురును ఎలా అవుతాను అని గొడవ పెట్టుకునేదేమో?..

విలువల పతనం..

కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ లో ఓ నటుడి వీరాభిమాని అయిన టీనేజర్, నా కామెంట్స్ ను ఖండిస్తూ బాబూ క్రాంతీ.. అని సంబోధించాడు.. అతడు పుట్టింది 1990లో.. అప్పటికి నా వయస్సు 17 ఏళ్లు.. అతని కన్నా  పెద్దవాన్ని కాబట్టి బాబూ అనే సంబోధన సరికాదు అని చెప్పడానికి తమ్ముడూ.. అంటూ రాశాను.. వెంటనే అతని దగ్గర నుండి వచ్చిన ఎదురు దాడి... ఎవడు నీకు తమ్ముడు.. అని.. అతనిపై నాకు కోపం రాలేదు.. కొందరి సంస్కారం అంతే అని అంతటితో వదిలేశాను..
ఈ విషయాన్ని ఎందుకు ప్రస్థావిస్తున్నానంటే సమాజంలో  పతనమవుతున్న విలువల గురుంచి చెప్పడానికే.. నేను చదువుకున్న వాతావరణంలో సంస్కారానికి పెద్ద పీట ఉండేది.. పెద్దలను గౌరవించాలని, ఎదుటి వారితో సభ్యతగా మాట్లాడాలని, చెడ్డగా మాట్లాడొద్దని ఇంట్లో పెద్దలు, పాఠశాలలో గురువులు చెప్పేవారు.. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందా అనిపిస్తోంది.. పెద్దవారిని చాదస్తపు మనుషులుగా చూస్తున్నారు.. దిక్కుమాలిన సినిమాల ప్రభావంతో వరే అన్నయ్యా.. అని పిలుస్తున్న రోజులు ఇవి..
మన పాఠశాల్లో ఉపాధ్యాయులు ఎక్కువ మార్కులు, ర్యాంకులు సాధించాలంటూ విద్యార్థులపై వత్తిడి తెస్తుంటారు.. మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగం అంటూ తల్లిదండ్రులు పోరు పెడుతుంటారు.. ఇలా కోరుకోవడంలో తప్పేమీ లేదు.. కానీ తమ పిల్లలు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరుకునేవారున్నారా అసలు? అనిపిస్తోంది..
దీనికంతటికీ కారణం ఒకటే మన చదువుల్లో నైతిక విద్య లోపించడమే.. కొన్నేళ్ల క్రితం వరకూ కూడా పాఠశాల్లో నీతి కథలు, పద్యాలు, శ్లోకాలు, సూక్తులు చదివించేవారు.. వాటి ప్రభావం విద్యార్థులపై జీవితాంతం ఉండేది.. కానీ ఈనాటి చదువుల్లో ఆ పరిస్థితి ఉందా?...
మరీ బోరు కొట్టిస్తున్నానేమో సెలవు..

Friday, May 2, 2014

యువ జోష్ అంటే ఇదా?..

కాంగ్రెస్ వారి ఎన్నికల ప్రచారంలో యువ జోష్ ప్రకటన చూసి ఏమిటో అనుకున్నా.. కాస్త ఆలస్యంగా అర్థం తెలిసింది..