ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి నేడు..హైదరాబాద్ తో పటు ఐదు వందలకు పైగా సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన నవభారత నిర్మాత సర్దార్ పటేల్.. పటేల్ ప్రధాన మంత్రి అయ్యుంటే కాశ్మీర్ తో సహా దేశ సమస్యలు అన్నింటిని సమర్ధంగా పరిష్కరించి ఉండేవారు.. సర్దార్ పటేల్జిని స్మరించుకోవడం భారతీయులుగా మన విధి..
Wednesday, October 31, 2012
Friday, October 26, 2012
కమలం బురద తొలగేనా?

1980లో భారతీయ జనతా పార్టీ (గతంలో జన సంఘ్) ఏర్పడ్డప్పుడు బురదలో పుట్టిన పార్టీ అని ప్రత్యర్థులు ఎద్దేవా చేసారు.. ఎందుకంటే కమలం ఆ పార్టీ చిహ్నం.. కమలం బురదలో పుడుతుంది.. అప్పుడు అటల్ బిహారి వాజపేయి ఒక మాట చెప్పారు.. 'కమలం బురదలో బుట్టిన స్వచంగా ఉంటుంది.. అలాగే బురదగా మారిన రాజకీయాల్లో బి.జె.పి. తన ఆదర్శాలతో స్వచ్చమైన రాజకీయ పార్టీగా కొనసాగుతుంది..'
కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? కర్ణాటకలో అవినీతి అనే పందిలా పొర్లాడిన యడ్యురప్ప కారణంగా బిజెపి ప్రతిష్టకు మచ్చ పడింది.. అప్పను ఆలస్యంగా అయిన ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించినా, కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దమై పక్కలో బల్లెంగా మారాడు.. కర్ణాటక యవ్వారం ఇలా ఉంటే ఇప్పుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారి గతంలో చేసిన ఘన కార్యాలు బయట పడుతున్నాయి.. అవినీతి, అసమర్థ విధానాలతో కాంగ్రెస్ నేతృత్వ యు.పి.ఎ. ప్రభుత్వ ప్రతిష్ట దిగజారడంతో 2014లో అధికారం తమదే అని బి.జె.పి. ధీమాగా ఉంది.. కానీ ఇప్పుడు కేజ్రివాల్ గారి పుణ్యమా అని గడ్కారి బి.జె.పి.కి గుడి బండగా మారారు..
గడ్కారి అవినీతికి నిజంగా అవినీతికి పాల్పడ్డారా లేదా అన్నది తేల్చాల్సింది న్యాయస్థానమే అయినా, అది తేలేది 2014 ఎన్నికల తర్వాతే.. మరి ఈలోగా బి.జె.పి. ప్రజలకు ఏమి సమాధానం చెప్పుకుంటుంది? పార్టీ అద్వానితో సహా పార్టీ అగ్ర నాయకులంతా గడ్కారిని వెనుకేసుకు వస్తున్నారు.. కానీ బి.జె.పి. కార్యకర్తలు ఓటర్లకు ఏమి సమాధానం చెబుతారు? కాంగ్రెస్ కు, బి.జె.పి. మధ్య ఎలాంటి తేడా ఉందని నిరూపిస్తారు?
గుడ్డిలో మెల్ల ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీకి సోకాల్డ్ గాంధీలు తప్ప ఇతరులు అధినాయకులు కాలేరు.. ప్రజాస్వామ్య విధానాలు ఉన్న బి.జె.పి.కి ఆ పరిస్థితి లేదు.. బి.జె.పి.కి నాయకత్వ సమస్య లేదు.. కానీ ఎవరు ఆధ్యక్ష పదవి చేపడతారు? ఎవరు ప్రధాని అభ్యర్థి అన్నదే సమస్య..
Wednesday, October 24, 2012
హిందువులకు మనోభావాలు ఉండవా?
ఈ దేశంలో హిందువులకు ఎలాంటి మనోభావాలు ఉండవు.. మనోభావాలు ఉండేవి హైందవేతర మతస్తులకే.. విజయదశమి సందర్భంగా కొందరు వ్యక్తులు జరిపిన ప్రచారం ఆశ్చర్యాన్ని కలిగించింది.. దసరా రోజున రావణ దహనం బదులు రావణ వర్దంతి జరపాలట.. రావణుడు మంచివాడేనట.. అణువణువునా హిందూ మతంపై ద్వేషం పెంచుకున్న కొందరు వ్యక్తులు చేసిన రాద్దాంతం ఇది.. వాస్తవానికి వీరు హిందువులు కాదు.. హిందూమతం పై విశ్వాసం లేని వారు, హిందువుల విశ్వాసాలతో ఆటలాడే ఇలాంటి చర్చలు జరపడంలోని అంతర్యం ఏమిటి?.. హైందవేతర మతస్తుల విశ్వాసాలపై ఇలాంటి చర్చ జరిపే ధైర్యం వీరికి ఉందా?..
కొద్ది నెలల క్రితం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో జరిపిన పెద్ద కూర పండుగను ఒక్క సరి గుర్తు తెచ్చుకోండి.. గొడ్డు మాంసం తినాలనుకుంటే తినొచ్చు.. అది వారి ఇష్టం.. కానీ ఇందు కోసం హడావిడి చేయాల్సిన అవసరం ఏముంది? హిందూ మత విశ్వాసాలను ద్వేషించే వారు, నాస్తికులు, అన్య మతస్తులే పెద్ద కూర పండుగ సూత్రధారులు.. ఇది అబద్దం అని నిరుపించాగలరా?
ఎక్కడో కార్టున్ గీసారని, తమ విశ్వాసాలకు భంగం కలిగించారని ఒక మతం వారు చేసిన విధ్వంసాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. హిందువులు ఉదార స్వభావులు కాబట్టే ఇలాంటి వారి ఆటలు సాగుతున్నాయి.. ఈ ప్రపంచంలోని ప్రతి మతం విశ్వాసాల ఆధారంగా ఏర్పడిందే.. ఇష్టం లేకపోతె మాట విశ్వాసాలను పాటించాల్సిన అవసరం లేదు.. కానీ పైకి హిందువులుగా చలామణి అవుతూ, గుట్టుగా అన్య మతాలను పాటిస్తూ, హిందూమతంపై బురద చాల్లే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు..
విశ్వాసాలను నిష్టగా పాటించే వారిని అట పట్టించడం, మతోన్మాదులని ద్వేషించడం ఫ్యాషన్ అయిపొయింది.. హిందువులు ఉదార వాదులుగా ఉండటమే పాపమా?
Monday, October 22, 2012
Sunday, October 21, 2012
ఇంకా నేర్చుకోని గుణపాఠం
చైనాతో జరిగిన యుద్ధంలో మమమన దేశం ఓటమిపాలై ఏళ్లు గడచిపోయాయి.. హిందీ-చీనీ భాయ్ భాయ్ అనే గుడ్డి విధానంతో నాటి భారత ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చౌ ఎన్ లై మనస్సులో ఉన్న కుట్రను గ్రహించలేకపోయారు.. దానికి తోడు మన దేశం ఆనాడు అనుసరించిన అంతర్జాతీయ విధానంలోని లోపాలు కొంప ముంచాయి.. నాటి కేంద్ర రక్షణ మంత్రి కృష్ణ మీనన్ ను గుడ్డిగా నమ్మిన నెహ్రూ ఈ యుద్దంలో ఓటమితో ఎంతో వ్యధ చెందారు.. 1947లో మన దేశానికి స్వాతంత్రం రాగే నెహ్రూ చేసిన తప్పు అప్పటి వరకూ బ్రిటిష్ ఇండియా రక్షణలో ఉన్న టిబెట్ నుండి సైన్యాన్ని ఉపసంహరించడమే.. రెండో తప్పు టిబెట్ దేశాన్ని చైనా ఆక్రమించినప్పుడు ఖండించక పోవడం.. పైనా చైనాలో టిబెట్ అంతర్భాగమని అంగీకరిస్తూ, ఐక్యరాజ్య సమితిలో ఛైనాకు శాశ్వత సభ్యత్వం ఇప్పించే ప్రయత్నం చేశారు నెహ్రూ.. రక్తం రుచి మరగిన తోడేలు లాంటి చైనా అదను చూసి 1962 అక్టోబర్ 20న భారత దేశంపై దాడి చేసింది.. ఆనాటి యుద్దంలో చిత్తుగా ఓడిపోయాం..
ఆనాటి ఓటమి తాలూకూ పీడ కలలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కబలించిన చైనా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తమదేనంటూ క్లెయిమ్ చేస్తోంది.. భారత దేశాన్ని సైనిక, ఆర్థిక దిగ్భందనాలతో కబలించే ప్రయత్నం చేస్తున్న చైనా విషయంలో మన దేశం ఇంకా తప్పిదాలు చేస్తూనే ఉంది.. ఆనాడు సైనిక పరంగా విజయం సాధించిన చైనా ఇప్పడు, తన పనికిరాని చవక చెత్త వస్తువులతో ఇండియా మార్కెట్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది.. మన దేశానికి మొదటి శత్రువు పాకిస్తాన్ అని అందరూ భావిస్తారు.. నిజానికి చైనాయే మన ప్రథమ శత్రువు.. ఈ విషయాన్ని ఎన్డీయే ప్రభుత్వ హయంలో రక్షణ మంత్రిగా పని చేసిన జార్జ్ ఫెర్నాండెజ్ ను ప్రతిపక్షాలు వెర్రి నాగన్నలా చూశాయి.. కానీ ఆయన చెప్పింది వాస్తవం అనే నిజం నిలకడమీదే అర్థం అవుతోంది..
చైనా యుద్దంలో మన దేశం కోసం పోరాడిన వీర జవానుల సేవలను గుర్తించేందుకు ఘనత వహించిన భారత ప్రభుత్వానికి 50 ఏళ్లు పట్టింది.. ఆనాటి జవాన్ల వీరోచిన పోరాటాన్ని గౌరవించి వారికి సల్యూట్ చేయడం భారతీయులుగా మన విధి.. అలాగే చైనాతో తస్మాత్ జాగ్రత్త..
పూరీల సినిమాల చిచ్చు
సినిమాలను సమాజంతో వేరు చేయలేం.. అందునా మన రాష్ట్రంలో.. సినిమాలే లోకంగా జీవించే వారెందరో ఉన్న రాష్ట్రం మనది.. దిన పత్రికలు సినిమా వార్తలకు ప్రత్యేకంగా పేజీని కేటాయించడమే ఇందుకు ఉదాహరణ.. ఇటీవల రెండు చిత్రాలు పెట్టిన చిచ్చు అంతా ఇంతా కాదు.. కెమెరామెన్ గంగతో రాంబాబు, ఎ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.. ఈ రెండు చిత్రాలు ‘పూరీ’లవే కావడం విశేషం.. కెమెరామెన్ గంగతో రాంబాబు ద్వారా పూరీ జగన్నాధ్ తెలంగాణ వాదుల మనోభావాలను, ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజంతో జీటీ పూరీ బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బ తీశారు.. ఈ పూరీలు ఆశించిన సామాజిక ప్రయోజనం ఏమిటో తెలియదు కానీ అశాంతిని సృష్టించారు.. సమాజంలో ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది.. దీన్ని కాదనలేం.. కానీ ఈ స్వేచ్ఛకూ పరిమితులు ఉన్నాయి.. స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం అంటే కుదరదు.. నచ్చకపోతే తిరస్కరించే స్వేచ్ఛ కూడా అవతలి పక్షానికి ఉంటుంది.. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు.. తమ భాష, సంస్కృతి, కట్టుబొట్టులపై ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్లు ఉంటాయి.. తమ వాదనే కరెక్టరనే మొండి వాదనతో తమ వ్యాపార ప్రయోజనాల కోసం తమ పెంటను అందరూ భరించాలంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి?
Subscribe to:
Posts (Atom)
.jpg)




