అన్నాహజారే బృందం చేస్తున్న మతిలేని ప్రకటనలు చూస్తుంటే అవినీతిపై వారు చేస్తున్న పోరాటం విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన మంత్రివర్గ సహచరులు అవినీతిపరులని అన్నాహజారే బృందం తేల్చేసింది.. అయితే తన బృందం విడుదల చేసిన నివేదికను అన్నాజీయే నమ్మకలేక పోయారు.. ప్రధాని నిజాయితీ పరుడే అంటూ వివరణ ఇచ్చారు.. ఇదేమిటయ్యా అని టీమ్ అన్నాను ప్రశ్నిస్తే, హజారేజీకి ఇంగ్లీష్ రానందున తమ నివేదికను చదవలేదని ఇకిలించారు.. ప్రధాని అవినీతి పరుడని అన్నాయే నమ్మనప్పుడు దేశ ప్రజలు ఎలా నమ్మగలరు? కనీసం టీమ్ అన్నా సభ్యుల జీవిత భాగస్వాములైనా నమ్మగలరా? తాను అవినీతిపరున్నని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని ప్రధానమంత్రి ప్రకటించారు.. మన్మోహన్ సింగ్ అసమమర్థ ప్రధాని అనడంలో సందేహం లేదు.. అవినీతిని అరికట్టడంలో, దేశ ఆర్థిక రంగాన్ని నియంత్రించడంలో విఫలమయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు.. యూపీఏ ప్రభుత్వంలో ఆయనో కీలు బొమ్మ, అసలు రిమోట్ సోనియా గాంధీ దగ్గర ఉంటుందని అందరికీ తెలుసు.. ఈ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కం ఆర్థికవేత్తకు ఉన్న క్లీన్ ఇమేజీని అడ్డంపెట్టుకొని దేశాన్ని దోచేస్తున్నవారెవరో అందరికీ తెలుసు.. చేతనైతే అన్నా బృందం వారి వెంట పడాలి.. ప్రజలు కూడా మద్దతు ఇస్తారు.. నోరులేని ప్రధానిపై చేస్తున్న విమర్శలు నవ్వును తెప్పించడంతో పాటు అన్నా బృందాన్ని చులకన చేస్తున్నాయి.. కేజ్రీవాల్, ప్రశాంత్ భూషన్, కిరణ్ బేడీల లొసుగులేమిటో అందరికీ తెలుసు.. ఈ గురవింద అతిగాళ్లను అన్నా హజారే ఎలా భరిస్తున్నారో?.. వీరిని వదిలించుకుంటే అన్నాజీ గౌరవం పదింతలవడం ఖాయమని నేను కచ్ఛితంగా చెప్పగలను..
Thursday, May 31, 2012
Wednesday, May 30, 2012
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
నిరసన తెలియజేయడానికి బంద్ నిర్వహించడాన్ని అర్థం చేసుకోవచ్చు.. కానీ రాజకీయ పార్టీల బందులు ప్రాణాలు తీయడానికి దారి తీస్తే అందుకు ఎవరు బాధ్యత వహించాలి? రాజకీయ పార్టీలన్నీ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.. ఇటీవల జరిగిన ఒక బంద్ రోజున రంగారెడ్డి జిల్లా లోని ఇబ్రహీంపట్నం సమీపంలో కొందరు వ్యక్తులు వేగంగా వెళ్ళుతున్న బస్సుపై రాళ్లు విసిరారు. డ్రైవర్ కంటిలో అడ్డం ముక్కపడి బస్సు అదుపు తప్పి కరెంట్ పోల్ కు గుద్దుకుంది.. పాపం డ్రైవర్ మరణించాడు.. అయన కుటుంబాన్ని ఓదార్చే వారెవరు? ఈ సంఘటన జరగటానికి రెండు రోజుల ముందు వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఆర్టీసి బస్సులకు నిప్పు పెట్టారు? ఇందుకు ఒక పార్టీ వారినే తప్పు పట్టడం తగదు.. రాజకీయ పక్షాలన్నీ దోషులే.. టీజేఏసీ తుగ్లక్ చర్య
పరకాల ఉప ఎన్నిక విషయంలో తెలంగాణ రాజకీయ సంయుక్త కార్యాచరణ సమితి (టీజేఏసీ) నిర్ణయం హాస్యాస్పదంగా ఉంది.. నిష్పాక్షికంగా, తటస్థంగా ఉండాల్సిన టీజేఏసీ ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటు.. సర్వే సాకుగా చూపి నిర్ణయాన్ని ప్రకటించడం అర్థం లేని పని.. భాగస్వామ్య పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించలేనప్పుడు తటస్థంగా ఉండాల్సింది.. జేఏసీ పదవుల నుండి తొలగిస్తాం అనే బ్లాకు మెయిల్ కు భయపడి నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంది.. ౨౦౧౪ ఎన్నికల్లో ఒక పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు వారిని ప్రసన్నం చేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నమ్మాల్సి వస్తోంది.. అసలు సర్వే నిర్వహించక ముందే టీజేఏసీ నిర్ణయం ఏమిటో వెల్లడైన నేపథ్యంలో, సర్వే నివేదికను సాకుగా చూపడం ఎవరి చెవుల్లో పువ్వులు పెట్టడానికి? తెలంగాణ రావాలంటే మరెన్నో పోరాటాలు చేయాలి.. బ్రేకులు ఇచ్చుకుంటూ ఉద్యమాలు చేసే జేఏసీ. పరకాల ఫలితం వల్ల తెలంగాణ వాదానికి ఏదో అవాంతరం వస్తున్నట్లు భయపడటం అర్థంలేని పని.. టీజేఏసీ తుగ్లక్ చర్యలు తెలంగాణ ఉద్యమానికి ప్రమాదకరంగా మారాయి.. అందరిని కలుపుకోవడం చేతకాకపోతే పదవులూంచి తప్పుకోవడం బెటర్..
Tuesday, May 29, 2012
చిచ్చు పెట్టకండి..

Monday, May 28, 2012
అందరూ గురవిందలే..
జగన్ అరెస్టయ్యాడని కొందరు నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.. మరి కొందరు విచారిస్తున్నారు.. తమనూ అరెస్టు చేస్తారేమోనని భయపడే నాయకులూ ఉన్నారు.. వీరూ, వారూ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ అవినీతిపరులున్నారు.. అందరూ దొంగలే.. గురవిందలే.. తన లోపాన్ని కప్పిపుచ్చుకొని ఎదుటివారిపై బురద చల్లేవారే.. తాను నిజాయితీ పరులమని మనస్సాక్షిగా, ఇష్ట దైవంపై ప్రమాణం చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? వీరందరినీ అరెస్టు చేస్తూ పోతే రాష్ట్రంలో జైళ్లు చాలవేమో? నీతి, నిజాయితీ ఉన్న నాయకులకు గుర్తింపు లేకుండాపోయింది.. నీతి వాక్యాలు మాట్లాడే ‘సత్తా’ పార్టీకి సైతం అవినీతి పరులకు టికెట్లిచ్చిన చరిత్ర ఉంది..ఇందుకు మన వ్యవస్థను తప్పుపట్టాల్సిన అవసరం లేదు.. లోపం మన ప్రజల్లోనే ఉంది.. ఈ విషయంలో మరింత లోతుకు వెళ్లకపోవడమే ప్రస్తుతానికి మంచిదేమో..Saturday, May 26, 2012
క్రమశిక్షణ కోల్పోతున్న భాజపేయులు..
ఒకప్పడు క్రమ శిక్షణకు పేటెంట్ ఆ పార్టీ.. పూర్వాశ్రమంలో క్రమ శిక్షణ తప్పిన అధ్యక్షున్నే పార్టీ నుండి బహిష్కరించుకుంది.. కాలక్రమంలో అధికారంలోని వచ్చాక లంచం తీసుకున్నారనే అభియోగం ఎదుర్కొన్న అధ్యక్షున్ని వదిలించుకుంది.. జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీగా అవతరించినప్పడు తమది రాజకీయాలనే బురదలొంచి వికసించిన స్వచ్ఛమైన కమలమని గర్వంగా చెప్పున్నారు.. కానీ అధికారం అనే రుచి చూశాకా అన్ని రకాల అవలక్షణాలు పులుముకుంది.. అగ్రనేతలు సైతం క్రమశిక్షణ గాలికొదిలేసి ముఠాలు కట్టేసి పార్టీని కనుసన్నల్లో నడుపుకునే ప్రుయత్నం చేస్తున్నారు.. తాజా జాతీయ కార్యకర్గ సమావేశాలను చూస్తే.. తనకు పడని సంజయ్ జోషిని తప్పిస్తే కానీ సమావేశాలకు రాలేదు గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ.. మోడీకి ఇస్తున్న ప్రాధాన్యతను చూసి అనకబూనారు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్.. అవినీతి కేసుల్లో ఇరుక్కొన్ని కోల్పోయిన పదవిని మళ్లీ ఇవ్వాలంటూ పేచీ పెడుతున్న కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను బుజ్జగించి సమావేశాలకు పిలిచిన తీరుకు ఆగ్రహించారు అగ్రనేత అద్వానీ.. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే.. తనకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారంటూ పార్టీ జాతీయ నాయకత్వానికి ఇప్పటికే అలిటమేటం ఇచ్చేశారు రాజఅవినీతి, అసమర్థ విధానాలతో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న యూపీఏ ప్రభుత్వంపై పోరాడాల్సిన కమలనాథులు అంతర్గత కుమ్ములాటలతో కార్యకర్తలకు కన్నీరును, ఇతర విపక్షాలకు వినోదాన్ని, ప్రజలకు ఆగ్రహాన్ని ఏక కాలంటో పంచుతున్నారు..
Subscribe to:
Posts (Atom)


