Tuesday, December 19, 2017

గుజరాత్ ఎన్నికల ఫలితాలు బీజేపీకే లాభదాయకం

గుజరాత్ లో బీజేపీ తిరిగి విజయం సాధించడం, కాంగ్రెస్ పార్టీ నుంచి హిమాచల్ ప్రదేశ్ ను స్వాధీనం చేసుకోవడం ప్రధాని నరేంద్ర మోదీ ఘనతగా చెప్పడానికి కొందరు రాజకీయ, మీడియా విశ్లేషకులు అంగీకరించడం లేదు. తమదైన వక్రభాష్యాలు జోడించి గందరగోళం చేస్తున్నారు. నా దృష్టిలో మాత్రం ఇది అసలైన విజయం.
ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న వేళ ప్రతిపక్షాలతో పాటు కొన్ని వర్గాలు పెద్ద ఎత్తున దుష్ప్రచారం మొదలు  పెట్టాయి. పెద్ద నోట్ల రద్దును స్వాగతించే మనస్థత్వం లేక చిన్న చిన్న కష్టాలను భూతాలుగా చూపి ప్రజలకు నష్టం జరిగిపోతున్నట్లు తప్పుదోవ పట్టించాయి. జీఎస్టీ విషయంలో కూడా ఇదే వైఖరిని ప్రదర్శించాయి.
ఇదే సమయంలో మోదీజీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు రావడం వారికి ఆయుధంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నోట్ల రద్దు, జీఎస్టీలనే ప్రధాన ఎజెండాగా స్వీకరించింది. మరోవైపే రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన పాటీదార్ల నాయకుడు హార్ధిక్ పటేల్ ను దుర్వింది. తాము అధికారంలోకి వస్తే పాటీదార్లకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఎన్నో ఇచ్చింది. గుజరాత్ లో రెండు దశాబ్దాలుగా వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, కొన్ని శక్తులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాయి.
ఈ పరిణామాలను ఛాలెంజ్ గా నే స్వీకరించారు ప్రధాని మోదీ.. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించరాదని, ఎవరైనా ఇలాంటి హామీ ఇస్తే మోస పూరితం అవుతుందని కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు మోదీ.. దీన్ని అర్థం చేసుకున్న మెజారిటీ పాటీదార్ వర్గీయులు కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలను నమ్మలేదు. ఇక జీఎస్టీతో ఏర్పడ్డ ఇబ్బందులు పరిష్కరించాలంటే అది కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాతోనే సాధ్యం. కాంగ్రెస్ గుజరాత్ లో గెలిచినా చేతులు ముడుచుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని ఆ రాష్ట్ర వ్యాపార వర్గాలకు తెలుసు. అందుకే ఈ అంశాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు.
గతంలో మోదీజీని ‘ఛాయ్ వాలా’ అంటూ పరిహసించిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి ‘నీచ్’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకే నష్టం చేకూర్చాయి. పైగా గుజరాత్ ఎన్నికల సమయంలో పాకిస్తాన్ నాయకులతో కాంగ్రెస్ పార్టీ జరిపిన రహస్య సమావేశం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాలను ప్రధాని ఎన్నికల ప్రచారంలో ప్రస్థావిస్తే, దాన్ని కూడా తప్పు పట్టే ప్రయత్నం చేశారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఓటింగ్ సరళిని విశ్లేషిస్తే నగరాలు, పట్టణాల ప్రజలు, వ్యాపారులు  భాజపాకే ఓటు వేశారు. పాటీదార్లు అధికంగా ఉన్న సౌరాష్ట్ర, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అధికంగా సీట్లు వచ్చాయి. రైతాంగంలో కొంత మేర అసంతృప్తి ఉంది. ఈ లోపాలను సరిదిద్దు కోవడం బీజేపీకి కష్టం కాదు. కాంగ్రెస్ ఉచ్చులో పడి హార్దిక్ పటేల్ మోసపోయాడు. అదే సమయంలో పాటీదార్ల రిజర్వేషన్లకు వ్యతిరేకమైన దళిత నేత జిగ్నేష్ మేవానీ, ఓబీసీ నేత అల్పేష్ ఠాగూర్ కాంగ్రెస్ పార్టీలో ఒప్పందం కుదుర్చకొని ఎమ్మెల్యేలుగా గెలిచారు.
కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి తగ్గట్టే గుజరాతీ ప్రజలు ఓటు ఇచ్చి సత్కరించారు. మరోసారి బలమైన ప్రతిపక్షంగా గెలిపించారు. పాపం రాహుల్ గాంధీ గుళ్లూ, గోపురాలు తిరిగి హిందూ ఓటు బ్యాంకును పొందేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.
గుజరాత్ లో బీజేపీ గెలిచినా సీట్లు తగ్గాయి. కానీ ఇది ప్రధాని మోదీజికి నిజమైన గెలుపు. ఆయన చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి సంస్కరణలను గుజరాతీ ప్రజలు స్వాగతించారు అనే ఫలితాలు చెబుతున్నాయి. కాబట్టి మోదీజీ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మాయాజాలంలో పడకుండా నిరభ్యంతరంగా ముందుకు సాగవచ్చు.. అదే సమయంలో గుజరాత్ ఫలితాలను అధ్యయనం చేసిన కాంగ్రెస్ ముక్త్ భారత్ దిశగా వ్యూహాలకు పదును పెట్టుకోవచ్చు..

సో.. మోదీజీ ఆగే బడో.. ఇస్ దేశ్ ఆప్ కే సాథ్ హై..

Friday, December 15, 2017

అమరనాథ్ యాత్రపై మతిలేని ఆంక్షలు

సనాతన హిందూ ధర్మానికి ప్రకృతికి విడదీయరాని సంబంధం ఉంది. పంచభూతాలైన అగ్ని, భూమి, నీరు, వాయువు, ఆకాశాలను దేవతలుగా పూజిస్తాం.. మన వేద వాఙ్మయంలో వీటి ప్రస్థావన ఉంది. కానీ హైందవం ప్రకృతికి విఘాతం అనే రీతిలో కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. వినాయక చవితి, దీపావళి వేడుకల సందర్భంగా ఈ వర్గాలకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అడ్డగోలుగా మాట్లాడేస్తూ మెజారిటీ ప్రజల మనోభావాలను కించపరచడం పరిపాటిగా మారింది. బాధ్యతాయుతమైన సంస్థలు కూడా గుడ్డిగా ఇలాంటి వారి వాదలకు వత్తాసు పలిచే ఆంక్షలు విధించడం, ప్రకటనలు చేయడం దారుణం..
అమరనాథ్ యాత్ర కారణంగా హిమాలయాల్లో పర్యావరణానికి ముప్పు వాటిల్లిందని ఎవరో పనికిమాలిన వారు వేసిన పిటిషన్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అతిగా స్పందించింది.. యాత్రీకులకు విధించిన ఆంక్షలు పూర్తిగా హాస్యాస్పదంగా ఉన్నాయి..
' అమరనాథ్ గుహలో గంట కొట్టరాదు.. మంత్రాలు చదవరాదు.. కొబ్బరికాయ కొట్టరాదు..' ఇలాంటి ఆంక్షలను చూస్తుంటే అమరనాథ్ యాత్రపై ఎందుకు ఇంత కక్ష అనిపించడం లేదా?
ఏటా లక్షలాది మంది యాత్రీకులు హిమాలయ గుహలో మంచు లింగం రూపంలో వెలిసిన భోళా శంకరున్ని దర్శించుకుంటారు.. ఈ భక్తుల మనోభావాలను దెబ్బతీసే హక్కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఎవరు ఇచ్చారు?..
మధ్యయుగంలో హిందువుల తీర్థయాత్రలపై జిజియా పన్ను విధించేవారు.. ఇంకా నయం ఇలాంటి పన్నును అమరనాథ్ యాత్రీకులపై విధించాలని సిఫార్స్ చేయలేదు..
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధిస్తున్న తలతిక్క తుగ్లక్ ఆంక్షలను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలి..

Wednesday, December 13, 2017

అంత రహస్యం ఏమిటో?

‘ఉల్టా చోర్ కొత్వాల్ కో మారా..’ తాము చేసిన పనికి సిగ్గు పడకుండా ఎదురుదాడికి దిగడం ఎందుకో?..
గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు పాకిస్తానీ నాయకులతో సమావేశం కావడం దేనికి సంకేతం?.. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్థావించగానే ‘దూడ గడ్డి కోసం తాటిచెట్టు ఎక్కాం..’ అన్నట్లు ఆ పార్టీ వివరణ ఇచ్చుకోవడం ఏమిటి?.. ‘మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి..’ అంటూ పాకిస్తాన్ ప్రకటించడం.. ‘అసలు పాకిస్తాన్, చైనాల ప్రస్థావన ఎందుకు?, ప్రధాని క్షమాపణ చెప్పాలి’ అని కాంగ్రెస్ భుజాలు తడుముకోవడం దేనికి సంకేతం.. గతంలో కూడా రాహుల్ గాంధీ చైనా నాయకులను రహస్యంగా కలుసుకోవడం, ఒక విదేశీ ప్రతినిధుల విందులో దేశ రాజకీయాల గురుంచి నోరు జారడం అందరికీ తెలిసిందే..
తాజా ఘటనలో నిజంగానే కాంగ్రెస్ పార్టీకి నిజంగానే దురుద్దేశ్యం లేకపోతే భాజపా నాయకులు బయట పెట్టే దాకా భేటీ విషయాన్ని ఎందుకు దాచారు?.. పైగా ఈ సమావేశం జరిగింది ప్రధానిని ‘నీచ్’ అంటూ దుర్భాషలాడిన మణిశంకర్ అయ్యర్ ఇంట్లో.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మరి కొందరు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్న ఈ సమావేశం పాకిస్తాన్ మాజీ మంత్రి గౌరవార్థం అట..
బురదలోకి దిగి తమకు మరకలు అంటించొద్దని హెచ్చరించడం అంటే ఇదే మరి.. పాకిస్తాన్ నాయకులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపిందంటే దానికి ఒక అధికార హోదా ఉంటుంది.. చర్చల సారాంశం కూడా అందరికీ తెలుస్తుంది.. కానీ కాంగ్రెస నాయకులు ఏ హోదాలో శత్రు దేశం నాయకులతో సమావేశమైనట్లు? పైగా రహస్యంగా ఎందుకు దాచిపెట్టినట్లు? అందునా గుజరాత్ ఎన్నికల వేళ భేటీ ఏమిటి?.. పైగా అడిగితే దబాయింపు..
(12.12.2017)

Thursday, December 7, 2017

కాంగ్రెస్ కు అయ్యరోరి కష్టాలు

అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ఉంది యవ్వారం.. శతాధిక వయోవృద్ధ కాంగ్రెస్ పార్టీకి వారసత్వ (వైఫల్య) నాయకుడు సారధి అవుతున్న వేళ ‘హాచ్’మంటూ తుమ్మేశాడు అయ్యరోరు..
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీని ఛాయ్ వాలా అంటూ ఈసడించాడు మణిశంకర్ అయ్యర్.. ఎన్నికల తర్వాత మోదీ కాంగ్రెస్ ఆఫీసు ముందు ఛాయ్ అమ్ముకుంటాడని ఎద్దేవా చేశాడు..
ఛాయ్ అమ్మి జీవితాన్ని ప్రారంభించిన మోదీ ఈ మాటలతో కుంగిపోలేదు.. ఛాయ్ నే ట్రేడ్ మార్క్ చేసుకున్నారు.. ఛాయ్ పే చర్చా పెట్టారు.. దేశానికి ప్రధాని అయిపోయారు.. పాపం అయ్యరోరు ఛాయ్ అమ్ముకొని బతకడానికి కూడా పనికిరాకుండా పోయాడు..
ఇప్పుడు ఈ అయ్యరోరు ప్రధాని మోదీని ‘నీఛ్’ అంటున్నాడు.. గతంలో మాదిరే మోదీకి మళ్లీ ఆయుధం దొరికింది.. బెంబేలెత్తిన రాహుల్ గాంధీ అర్జంటుగా మణిశంకర్ అయ్యర్ తో క్షమాపణ చెప్పించారు.. ఇది చాలదనుకున్నారేమో.. ఏకంగా ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సాగనంపారు..

అన్నట్లు ఈ అయ్యరోరు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు కావడాన్ని సమర్ధించిన తీరు కూడా వింతగానే ఉంది. ‘ జహంగీర్ వారసుడిగా షాజహాను, షాజహాను వారసుడు ఔరంగజేబు వచ్చినప్పుడు ఎన్నికలు జరగలేదు.. ‘ అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు సైతం బెడిసి కొట్టాయి.. కాంగ్రెస్ పార్టీ వారిది ఔరంగజేబు రాజ్యమని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ.. పాపం కాంగ్రెసోళ్లకు ఈ మణిశంకర్ అయ్యరోరు శల్యునిలా దాపురించారు..

మందిర్ వహీ బనాయేంగే..



6 డిసంబర్, 1992
దేశ చరిత్రను మలుపు తిప్పిన రోజు ఇది.. రామ జన్మభూమిపై విదేశీ దండ యాత్రికుడు బాబర్ నిర్మించిన కట్టడాన్ని తొలగించిన రోజు.. కుహనా లౌకికవాదం చావుదెబ్బ తిని, జాతీయవాదం మేల్కొన్న సందర్భం.. శ్రీరామ జన్మభూమి ఉద్యమం మరో స్వతంత్ర పోరాటంలా సాగింది.. వందలాది మంది ప్రాణత్యాగం చేశారు.. దురదృష్టం కొద్దీ న్యాయస్థానాల సుదీర్ఘ జాప్యం కారణంగా నేటికీ జన్మభూమిలో రామ్ లల్లా ఆలయం సాకారం కాలేదు.. అయోధ్యలో రాముని గుడి నిర్మించి నప్పుడే ఈ పోరాటం ఫలించినట్లు.. అప్పటి వరకు సాగాల్సిందే ఈ పోరు..
సౌగంథ్ రామ్ కీ ఖాతే హై.. మందిర్‌ వహీ బనాయేంగే... జై శ్రీరాం

(06.12.2017)

Tuesday, December 5, 2017

కాంగ్రెస్ ముక్త్ దిశగా మరో అడుగు

'కాగల కార్యం గంధర్వులే తీర్చారు’.. అన్నట్లు 'కాంగ్రెస్'కాంగ్రెస్ ముక్త్  ముక్త్ భారత్ అభియాన్’కు ఆ పార్టీ నాయకులు సైతం సమిధలు అందించారు. రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నికోవడం ద్వారా.. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందిట.. రాహుల్ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష హోదాల్లో సాధించిన విజయాలు ఏవీ లేవు.. ఆయన ప్రచార బాధ్యతలు చేపట్టిన చోటల్లా ఓటమే కనిపిస్తోంది.. ఒకటి అరా స్థానిక కారణాల వల్ల సాధించిన గెలుపును యువరాజా ఖాతాలోకి నెట్టే ఆ పార్టీ క్యాడర్, వైఫల్యాలకు మాత్రం ఏనాడూ ఆయన్ని బాధ్యున్ని చేయలేదు..
కాంగ్రెస్ పార్టీలో హేమా హేమీ నాయకులు ఉన్నారు.. కానీ వారికి సోకాల్డ్ ‘గాంధీ – నెహ్రూ’ఫ్యామిలీయే ముద్దు. జవహర్ లాల్ నెహ్రూ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ వంశ పారంపర్యం అయిపోయింది. పార్టీలో అగ్ర నేతలను కాదని తన కూతురు ఇందిరా గాంధీని ప్రోత్సహించాడా మహానుభావుడు. సీనియర్లకు పొగబెట్టే కార్యక్రమాన్ని ఇందిర విజయవంతంగా పూర్తి చేసింది. వారసునిగా సంజయ్ గాంధీని నిశ్చయించినా, ఆయన విమాన ప్రమాదంలో మరణించాడు. దీంతో అనివార్యంగా రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాడు. ఇందిర హత్యానంతరం ప్రధానమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
రాజీవ్ హత్య తర్వాత విషాదంలో మునిగిపోయిన సోనియా గాంధీని కోటరీ నాయకులు కదిలించే సాహసం చేయలేక మెతక మనిషి కదా అని పీవీ నరసింహారావును అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.. ఆ తర్వాత ఆయనే ప్రధాన మంత్రిగా అయ్యారు. శాంత స్వభావుడు అనుకున్న పీవీ కాస్తా ఏకు మేకై అసలు సిసలు నారసింహుని అవతారం చూపడంతో కోటరీ పప్పులు ఉడకలేదు.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమికి బాధ్యున్ని చేసి పీవీని అన్యాయంగా తప్పించారు. సీతారాం కేసరి అనే విధేయున్ని మధ్యేమార్గంగా తోలుబొమ్మ అధ్యక్షునిగా పెట్టుకొని, చివరకు సోనియా గాంధీ చేతికి పగ్గాలు అప్పగించారు.  
తర్వాత కథ అందరికీ తెలిసిందే.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాకు ఎన్నికల్లో తన పార్టీ గలిచినా విదేశీయత కారణంగా ప్రధాని పదవి దక్కలేదు. దీనికి‘త్యాగం’ అనే పేరు పేట్టేశారు.. గత్యంతరం లేక మంచివాడైన మెతక మనిషి మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసి రిమోట్ కంట్రోల్ పాలన నడిపింది సోనియా గాంధీ.. పాపం ఆ పెద్దాయన తనకు తెలియకుండానే అవినీతి మరకల పాలన అందించారు. 
అనారోగ్యంతో బాధ పడుతున్న సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీని ఎనాడో పార్టీ అధ్యక్షున్ని చేయాలనుకున్నా, ఆయన చిపల చిత్తం కారణంగా ఆ సాహసం చేయలేక పోయింది. నాయకత్వ బాధ్యతలపై నేర్పు వచ్చేందుకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, అంతగా ఆయన ఉపయోగించుకోలేక పోయారు. కూతురు ప్రియాంకకు బాధ్యతలు ఇద్దామంటే ఇప్పటికే ఆమె పతి దేవుడు స్కాముల్లో మునిగిపోయాడు. చివరకు రాహుల్ కు పగ్గాలు అప్పగించక తప్పలేదు..
రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినందుకు అందరికన్నా హ్యాపీగా ఉన్నది కమలనాథులే..

Monday, November 27, 2017

వేదాల మీద విషం కక్కుడు ఎందుకు?

వేదాలు కర్ణకఠోరం.. ఎవరు వింటారు వాటిని.. కంపు.. అన్ హ్యూమన్.. న్యూసెన్స్.. ఇళ్ల మధ్య వేద పాఠశాల పెడతారా?.. లొల్లితో సాటి మనుషులను బాధ పెడతారా?.. ఇంగిత గ్నానం ఉందా?.. అడవుల్లో పెట్టుకొని నేర్పించవచ్చు కాదా.. తక్షణం ఖాళీ చేయడండి.. లేకపోతే ఏం చేయాలో అది చేస్తా.. వేదాలు నేర్చుకునే ఆ విద్యార్థులను ఏట్లోకి పంపండి..
ఒక రాజకీయ పార్టీకి చెందిన అడ్డ గాడిద కూతలు ఇవి.. వేద పాఠశాల నిర్వాహకులను ఫోన్లో అనరాని మాటలు అని, బండ బూతులతో బెదిరించాడు.. ధర్మ రక్షణ కోసం వేదాలను భావితరాలకు అందించడమే ఆ పండితుడు చేసిన నేరం మరి..
మీ పెళ్లిళ్లు వేద మంత్రాల సాక్షిగా జరగాలి.. ఇంట్లో శుభ కార్యాలకు, గుడిలో అర్చనలు, సన్మానాలు, సత్కారాలకు వేద పండితుల ప్రార్ధనలు, ఆశీస్సులు కావాలి.. కానీ వేద పాఠశాలు అక్కర లేదు.. ఇళ్ల మధ్య వేద పాఠశాలలు ఉండరాదు..
అన్యమతాల ప్రార్ధనాలయాలు, విద్యాసంస్థలు మాత్రం నిరభ్యంతరం ఉండొచ్చా?.. వాటి వల్ల ఎలాంటి న్యూసెన్స్ లేదా?..
వాహ్వా.. క్యాబాత్ హైజీ.. తాలీ భజావ్.. సెక్యులరిజమా వర్ధిల్లు.. సనాతన ధర్మం, సంస్కృతి ఇంతగా హేళనలకు గురవుతున్నా, భరిస్తున్న మొద్దు చర్మం హిందువులు ఉన్నంత కాలం ఈ దేశంలో ఇలాంటి కూతలు భరించాల్సిందే.. నపుంసక రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో స్వధర్మాన్నే నిర్వీర్యం చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే.. ఎందుకంటే ఎదిరిస్తే కమ్యూనల్ అవుతాం..