*స్నేహం ఇవాళ పుట్టిందా?.. నిన్న లేదా?.. రేపు ఉండదా?.. అసలు స్నేహానికి దినం ఏమిటి?..*
స్నేహం అంటే ఒక్క రోజులో పుట్టి చచ్చేదేనా?..
స్నేహానికి హద్దులు, పద్దులూ లేవు.. స్నేహానికి సరిహద్దులూ, ఎల్లలూ లేవు.. స్నేహం నిత్యం, ప్రతి క్షణం.. స్నేహం స్వచ్ఛమైనది, విలువైనది.. ఏదీ ఆశించనిదే స్నేహం.. ఆపదలో ఉంటే ఆదుకునేది స్నేహం.. అవసరమైతే ప్రాణం ఇచ్చేది స్నేహమే.. జీవితంలో స్నేహాన్ని మించిన ఆస్తి, సంపదలు లేవు.. ప్రేమ, ఆత్మీయత, ఆనందం, త్యాగం కలబోస్తేనే స్నేహం..
ఇలాంటి పవిత్ర పదానికి ఒక దినమా.. స్నేహాన్ని ఒక్క రోజులో పాటించి వదిలేయడానికి ఇదేమన్నా జన్మదినమా, వర్ధంతా?.. ఈ రోజు మాత్రమే శుభాకాంక్షలు చెప్పుకొని, మళ్లీ వచ్చే ఏడాది వరకూ కోల్డ్ స్టోరేజీ పెట్టేద్దామా స్నేహాన్ని..
మనకీ దినాల సంస్కృతి ఎందుకు?.. ప్రతి అంశానికి తేదీ నిర్ణయించి వేడుక జరుపుకోవాల్సి అవసరం మనకేమిటి? కొద్ది సంవత్సరాల క్రితం వరకూ గ్రీటింగు కార్డులు, గిఫ్టులు అమ్ముకోడానికి ఈ దినాలను ప్రోత్సహించారు.. ఇప్పుడు ఈ దినాల వ్యాపారం విస్తరించింది.. పత్రికల వారు ప్రకటనలు, మొబైల్ కంపెనీలు ఎస్సెమ్మెస్, టీవీ ఛానల్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్, కొత్తగా ఆన్ లైన్ వ్యాపారులు గిఫ్ట్ వ్యాపారం కోసం ఈ దినాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.. ఒకప్పుడు రక్షాబంధన్ నాడు రాఖీ కట్టేవారు.. ఇప్పుడు ఫ్రెండ్ షిప్ బాండ్స్ అట..
మనకు ఒక్క రోజుతో ముగిసే స్నేహాలు, వద్దు.. సంవత్సరంలో 365 రోజులూ ఉంటే స్నేహాలు కావాలి.. జీవితాంతం తోడుండే స్నేహితులు కావాలి.. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం.. -క్రాంతి దేవ్ మిత్ర
Monday, August 7, 2017
స్నేహానికి దినం ఎందుకు?
Saturday, July 1, 2017
మోదీ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం.. GST
దేశమంతటా GST అమలు నవశకానికి నాంది.. నిన్నటి దాకా పరోక్ష పన్నులు, రాష్ట్రానికో పన్ను విధానం.. ఇప్పుడు దేశంలో ఏ మూలకు పోయినా ఒకే రకమైన పన్ను విధానం. దీనికి స్వస్థి పలుకుతూ నరేంద్ర మోది ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద విప్లవాత్మక అడుగు వస్తు సేవల పన్ను విధానం GST.. భారత దేశ ఆర్థిక రంగంలో అతిపెద్ద సంస్కరణ ఇది.
సెంట్రల్ ఎక్సైజ్, సేవా పన్ను, వ్యాట్, వినోదపు పన్ను ఇలా పలు రకాల పన్నులకు వేర్వేరు పద్దులను నిర్వహించాల్సిన పరిస్థితి మున్ముందు ఉండదు. అలాగే ఒకటే లావాదేవీపై సేవా పన్ను, వ్యాట్ ఇలా పలు రకాల పన్నులను చెల్లించాల్సిన పరిస్థితి తొలగిపోయి ఇలాంటి లావాదేవీలన్నింటికీ ఒక్కటే పన్ను విధానం అమల్లోకి వచ్చింది.ప్రస్తుత విధానంలో పన్నుల విధింపు వివిధ రకాలుగా ఉంది. ఉదాహరణకు సెంట్రల్ ఎక్సైజ్ పన్ను విధానంలో తయారీపై పన్ను విధిస్తారు. విక్రయాలపై విలువ ఆధారిత పన్ను VAT, సేవలపై సేవా పన్ను ST విధిస్తున్నారు.‘ఒకే దేశం-ఒకే విపణి’ అన్న కల కార్యరూపం దాల్చింది. GST అనేది కేవలం పన్ను సంస్కరణ మాత్రమే కాదు. దేశ వ్యాపార ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ఓ విధాన ప్రక్రియ. GST అమలుతో రాష్ట్రాల మధ్య అడ్డుగోడలు కూడా తొలగిపోతున్నాయి. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో వస్తువులను విక్రయిస్తు న్నారో, సేవలు అందిస్తున్నారో అక్కడే పన్నులు చెల్లించాలి. GST అమలుతో వస్తువును తయారు చేసే రాష్ట్రంతో పోలిస్తే ఆ వస్తువు అమ్మకాలు జరిగే రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది.ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహించే ప్రతి రాష్ట్రంలోనూ కంపెనీలు ఎక్కడికక్కడ నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. GST విధానంలో ఒక రాష్ట్రంలో నమోదు చేసుకుంటే చాలు, దేశంలో ఏ ప్రాంతానికైనా వస్తువుల సరఫరా, సేవలు అందించే వీలు కంపెనీలకు ఏర్పడుతుంది.GSTతో సామాన్యుడిపై భారం పడుతోందన్నది దుష్ప్రచారం మాత్రమే.. కొన్ని వస్తు సేవలపై పన్నుల భారం పెరిగినట్లు కనిపించవచ్చు.. కానీ ఎన్నో రకాల పన్నులు తగ్గడంతో పాటు, ద్రవ్యోల్భనం అదుపులోకి వస్తోందనే వాస్తవాన్ని మరచిపోవద్దు. పూర్తి పారదర్శకంగా ఉన్న ఈ పన్నుల విధానం ద్వారా దేశ ఆర్థక వ్యవస్థకు మేలు జరగడంతో పాటు వినియోగదారులకు అన్ని విధాలుగా మేలే జరుగుతుంది. అందుకే మనమంతా GSTకి స్వాగతం పలుకుదాం.. జైహింద్..
Friday, June 30, 2017
మహోన్నత వ్యక్తి హరిహర శర్మ
ప్రముఖ విద్యావేత్త, సమాజిక కార్యకర్త హరిహర శర్మ గారు ఇక లేరనే వార్త వ్యక్తిగతంగా దిగ్భ్రంతిని కలిగించింది.. ఎంతో మంది జాతీయవాదులకు, యువతకు, విద్యార్థులకు స్పూర్తి ప్రధాతగా, మార్గదర్శిగా నిలిచిన శర్మ గారు విశిష్ట వ్యక్తిత్వం ఉన్న మహావ్యక్తి. విద్యార్థి దశ నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో వారితో అనుబంధం కొనసాగింది. విద్యార్థి పరిషత్ ఉపాధ్యక్షులుగా పని చేశారు, సమాచార భారతికి సుదీర్ఘ కాలం అధ్యక్షులుగా హరిహర శర్మగారు సేవలందించారు, జాగృతి ప్రకాశన్ ట్రస్టుకు గతంలో అధ్యక్షులుగా, ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నారు. అధ్యాపక వృత్తిలో విజయనగర్ కామర్ కాలేజీ ప్రిన్సిఫల్ గా పదవీ విరమణ చేశారు, రచనా జర్మలిజం కళాశాల వ్యవస్థాపకుల్లో శర్మగారు కీలకపాత్ర పోశించారు. కేశవ మెమోరియల్ విద్యాసంస్థకు ప్రస్తుతం వారు కార్యదర్శి. హరిహర శర్మ గారి నేతృత్వంతో పని చేయడం, వారితో అనుబంధం నా అదృష్టంగా భావిస్తున్నారు. వారు మన మధ్య లేకున్నా వారి స్పూర్తి నిరంతరం మనందరిలో కొనసాగుతుంది.. ఓం శాంతిMonday, June 12, 2017
జ్ఞాపకాల్లో సినారె
‘చిత్రం భళారే విచిత్రం..’ పొద్దున్నే దాన వీర శూర
కర్ణ చిత్రంలోని ఈ గీతం నా మదిలో మెదిలింది.. ఎన్టీఆర్ నటించిన ప్రతి నాయక పాత్ర దుర్యోధనుడికి
యుగళ గీతం ఒక ఎత్తైతే, ఆ పాటను రాసిన సినారె గుర్తుకు వచ్చారు.. కొద్ది గంటల్లోనే
దుర్వార్త.. ఆ మహా సాహితీ దిగ్గజం ఇక లేరని.. నా జ్ఞాపకాలు 17 ఏళ్లు
వెనక్కిపోయాయి..
'సర్.. నేను మీ అభిమానిని..'
చిరునవ్వుతో
నా వైపు చూసి ఏదో బ్రోచర్లో తల దూర్చారు ఆయన..
'మీ రచనలు, చాలా ఇష్టం.. మీరు రాసిన కవితలు, గజళ్లు,
పాటలు తరచూ చదువుతుంటాను..'
ఈసారి
ఆసక్తిగా నావైపు దృష్టి సారించారు..
ఒక
జర్నలిస్టుగా రవీంద్ర భారతిలో యాదృచ్చికంగా సినారెను కలిసిన సందర్భం అది.. ఇలా
ఇద్దరికీ సంభాషణ కలిసింది.. నా గురుంచి అడిగి తెలుసుకున్నారు.. ఎంతో ఆత్మీయత
కనిపించింది వారి మాటల్లో.. వీడ్కోలు
తీసుకునే ముందు కనబడుతూ ఉండు అన్నారు.. ఆ తర్వాత ఒకటి, రెండుసార్లు
మాత్రమే వారిని కలిసి ఉంటాను.. అయినా గుర్తు పెట్టుకొని మాట్లాడారు..
ఇటీవల
ఆ మహనీయున్ని కలవాలని చాలామార్లు అనుకున్నాను.. కానీ ఎప్పటికప్పుడు ఏదో పని పడుతూ
వాయిదా వేస్తూ పోయాను.. ఈలోగా శాశ్వతంగా దూరమయ్యారు.
హైదరాబాద్
సంస్థానంలో పుట్టి డిగ్రీ వరకూ ఉర్దూ మీడియంలో చదివిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి
తెలుగు సాహిత్యంలో ఉన్నత శిఖరాలను చేరడం, అధ్యాపకుడిగా, సినీ గేయ రచయితగా ఎనలేని
పేరు ప్రఖ్యాతలు సాధించడం చాలా అద్భుతమైన విషయం.
తెలుగు
సాహితీ ప్రపంచానికి సినారె చేసినంత సేవ మరే సాహితీవేత్త చేయలేదని నా ప్రగాఢ
విశ్వాసం.. జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ సహా ఎన్నో సాహిత్య అవార్డులు పద్మశ్రీ,
పద్మవిభూషన్ లాంటి పురస్కారాలు, రాజ్యసభ సభ్యత్వం వారి కీర్తి కిరీటంలో మణిపూసలుగా
నిలిచాయి..
కానీ
నాకు ఎందుకో అసంతృప్తి.. వారికి ఇంకా ఎక్కువ గౌరవం దక్కాల్సింది అని.. సిరారె
పవిత్ర స్మృతికి ఇదే నా అక్షరాంజలి..
Thursday, June 8, 2017
Monday, June 5, 2017
కశ్మీర్ ను మనం అక్రమించామంటున్న కాంగ్రెస్
భారత్ ఆక్రమిత కశ్మీర్ అట.. ఇదేదో పాకిస్తాన్ వాళ్లో, ఉగ్రవాదులో, వారి తొత్తులు అన్నా ఈ వెధవలింతే అని పట్టించుకోం.. కానీ ఈ మాట కాంగ్రెస్ పార్టీ కరపత్రంలో కనిపించింది. మోదీ ప్రభుత్వం మూడేళ్ల పాలనను విమర్శిస్తూ యూపీ కాంగ్రెస్ ప్రచురించిందీ బ్రోచర్.. ఇక వీరిని ఏమనాలో మీరే చెప్పండి..
ఈ మ్యాప్‌పై వివాదం చెలరేగడంతో ప్రింటింగ్ మిస్టేక్ అని తప్పించుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు.. అసలు కశ్మీర్ లో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన తప్పు ఫలితాన్ని 70 ఏళ్లుగా ఈ దేశం అనుభవిస్తున్న విషయాన్ని మరిపోతామా?
ఈ మ్యాప్‌పై వివాదం చెలరేగడంతో ప్రింటింగ్ మిస్టేక్ అని తప్పించుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు.. అసలు కశ్మీర్ లో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన తప్పు ఫలితాన్ని 70 ఏళ్లుగా ఈ దేశం అనుభవిస్తున్న విషయాన్ని మరిపోతామా?
Subscribe to:
Posts (Atom)




