Saturday, December 12, 2015

1857 నాటి కుట్రలు కొనసాగుతున్నాయి..

భారత స్వాతంత్ర్య సమర పోరాటానికి క్రీ.శ.1857సం.లో అంకురార్పణ జరిగింది.. బ్రిటిష్ వారు దీన్ని సిపాయిల తిరుగుబాటు (Sepoy Mutiny) అన్నారు.. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్  సావర్కర్ 1857లో జరిగింది ప్రథమ స్వాతంత్ర్య సమరం (First war of Independence) అని ఆధార సహితంగా చాటి చెప్పారు.. ప్రథమ స్వాతంత్ర్య సమరంలో సిపాయిల తిరుగుబాటు ఒక భాగం.. ఇంతకీ సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగిందో తెలుసా?
ఈస్టిండియా కంపెనీ సైన్యంలోని సిపాయిలకు ఎన్ ఫీల్డ్ అనే కొత్త తుపాకులు సరఫరా చేశారు.. సిపాయిలు ఈ తుపాకుల్లో లోడ్ చేసే తూటాల సీల్ ను పంటితో తొలగించాలి.. అయితే ఈ తూటాల సీలును ఆవు, పంది మాంసం నుండి తీసిన కొవ్వుతో తయారు చేయడం బయట పడింది.. కంపెనీ సైన్యంలో అత్యధికులు హిందువులు, ముస్లింలు.. బ్రిటిష్ వారు తమ మత విశ్వాసాలను అవహేళన చేయడాన్నివారు తట్టుకోలేకపోయారు.. మంగళ్ పాండే నేతృత్వంలో సైన్యంలో తిరుగుబాటు వచ్చింది..
ఒకటిన్నర శతాబ్దం క్రితం జరిగిన ఈ ఘటన బ్రిటిష్ వారి విభజించి పాలించు అనే కుటిల నీతిలో భాగం.. దేశ ప్రజలంతా ఏకమై దాన్నితిప్పికొట్టి ఐక్యతను చాటుకున్నారు.. ఆ తర్వాత జరిగిన జాతీయ ఉద్యమానికి ఈ ఐక్యత దారి చూపింది.. బ్రిటిష్ వాడు పోతూ పోతూ మన దేశాన్ని విభజించడంతో పాటు సమాజంలో చిచ్చు పెట్టి పోయాడు.. విదేశీ భావదాస్యతను జీర్ణించుకున్న కొన్ని శక్తులు ఈ నాటికి మన దేశాన్ని, సమాజాన్ని విచ్ఛినం చేసే దిశగా కుట్రలు పన్నుతూనే ఉన్నాయి..

ఇప్పుడు కొన్ని సంస్థలు నిర్వహిస్తున్న కూరల పండుగలను మనం ఏ దృష్టితో చూడాలి? తాము కోరుకుంటున్న ఆహారం తినే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. కానీ ఆహార స్వేచ్ఛ అంటూ వీధినపడి, మత పరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టడం ఎంత వరకూ న్యాయం? ప్రజల మత విశ్వాసాలతో ఆడుకొని వారిలో ఒకరిపట్ల మరొకరికి అపనమ్మకం, విధ్వేషాలను సృష్టించడం ఏ రకమైన స్వేచ్ఛకు ప్రతీక?.. ఆలోచించండి..

Wednesday, December 9, 2015

ఈ కూర పండుగ లొల్లి ఏంది?


అత్తను మించిన కోడలు..

తాను ఇందిరా గాంధీ కోడలినని, ఎవరికీ భయపడనని ప్రకటించుకున్నారు సోనియా గాంధీ.. ఈ విషయంలో ఎవరికీ అనుమానం లేదు.. రాజీవ్ గాంధీ భార్య నిస్సందేహంగా ఇందిరకు కోడలే అవుతుంది కదా?.. సోనియా ఎవరికీ భయపడనంటున్నారు.. అదే కదా దేశ ప్రజలకు భయం..
ఇందిరా గాంధీ ప్రధాని పదవిలో ఉన్నప్పుడు  అలహాబాద్ హైకోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే సహించలేక ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, పౌర హక్కులను కాలరాసి దేశంలో ఎమర్జెన్సీ విధించారు.. కొడుకు సంజయ్ గాంధీ అరాకచాలతో ఆమెకు అండగా నిలిచారు..  చరిత్రలో నియంతగా పేరు తెచ్చుకున్నారు ఇందిర..

ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ పత్రిక కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు తన ముందు హాజరు కమ్మని సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలను ఆదేశించింది.. దీనికి గగ్గోలు పెడుతూ విషయం ఏమిటో చెప్పకుండా పార్లమెంటును అడ్డుకున్నారు కాంగ్రెస్ ఎంపీలు.. ఈ సందర్భంగా తాను ఇందిర కోడలినని గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు సోనియా.. తాటాకు చప్పుళ్లకు మోదీ సర్కార్ భయపడుతుందంటారా?

Friday, December 4, 2015

చెన్నై గుణ పాఠం..

చెన్నపట్నం చిన్నబోయింది.. చెరువైపోయింది. భారీ వర్షాలకు నీట మునికి అతలాకుతలమైంది.. భారత దేశంలోని మెట్రోనగరాల్లో దక్షిణాదికే తలమానికంగా నిలచిన ఈ నగరానికి ఎందుకీ దుస్థితి? మానవ తప్పిదాల కారణంగానే ప్రకృతి కన్నెర్రజేసిందా?
ఒక్కప్పుడు చెన్నై నగరంలో పెద్ద సంఖ్యలో చెరువులు ఉండేవి.. మూడు ప్రధాన నదులు ఉన్నాయి.. వర్షం నీరు కాలువల ద్వారా చెరువుల్లో చేసి అక్కడి నుండి నదుల్లో చేరేది.. ఆ తర్వాత ఈ నీరంతా సముద్రంలో కలిసేది.. శివారు ప్రాంతంలో విచ్చల విడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోయి పొలాలు కనుమరుగయ్యాయి.. ఆ తర్వాత చెరువులను కబ్జా చేశారు.. చెన్నై శరవేగంగా అభివృద్ధి చెందుతూ కాంక్రీట్ జంగల్ అయిపోయింది..
చెన్నైలో గత వందేళ్లుగా ఇంతటి భారీ వర్షం కురవలేదు.. ఒక్కసారిగా పెద్ద వానలు పడే సరికి వాననీరు నగరాన్ని ముంచెత్తింది.. చెరువులు, కాల్వలు కనుమరుగవడంతో వరద నీరంతా వీధుల్లోకి వచ్చింది. వేల సంఖ్యలో ఇళ్లూ, భవనాలు మునిగాయి.. ప్రణాళికాబద్దంగా లేని నగరాభివృద్ధి కారణంగా డ్రైనేజీలు వరద నీటిని తట్టుకోలేకపోయాయి.. దీనికి తోడు విచ్ఛల విడిగా ప్లాస్టిక్ వాడకం కారణంగా చెత్తా చెదారం డ్రైనేజీల్లో ప్రవాహానికి అడ్డు పడింది.. ఉన్న కొద్ది పాటి కాలువల్లో భవన నిర్మాణ వ్యర్ధాలను పడేస్తున్నారు.. ఇక వరద నీరు ఎక్కడికి పోవాలి.. దీని ఫలితమే ఈ జల విలయం..

ప్రకృతి చెన్నైకి నేర్పిన గుణపాఠం ఇతర నగరాలకు కనువిప్పు కావాలి.. ప్రకృతికి వ్యతిరేకంగా పోతే వినాశనమే అని ఇకనైనా మనమంతా అర్థం చేసుకోవాలి..

ఔట్ లుక్.. జూట్ లుక్ అయింది..

నిజం నిద్రలేచేలోపు అబద్దం లోకం చుట్టి వస్తుందంటారు.. ఔట్ లుక్ పత్రిక బాధ్యతారహిత వ్యవహారం అలాగే ఉంది.. 
దేశానికి 800 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో హిందూ పాలకుడు వచ్చారని హోంమంత్రి రాజనాథ్ సింగ్ అన్నట్లుగా ఔట్ టుక్ పత్రిక రాసింది.. ఈ అంశాన్ని సీపీఎం ఎంపీ మహ్మద్ సలీం పార్లమెంట్ లో ప్రస్థావించగా, తాను అలా అన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని రాజనాథ్ సవాలు విసిరారు.. దీంతో ఔట్ లుక్ నాలిక కరుచుకుంది.. ఈ మాటలు రాజనాథ్ అనలేదని, అశోక్ సింఘాల్ అన్నారని ఇప్పుడు బొంకుతోంది.. అంటే ఇప్పుడు దివంగత సింఘాల్జీ వచ్చి వివరణ ఇచ్చుకోవాలా.. 
చిన్న చిన్న ఘటనలను చిలువలు పలువలుగా చేసి 'అసహన మంటలు' రాజేసి చలి కాచుకోవడం సమంజసమేనా?

ఈ కూర గోల ఏల?

ఇవాళ పెద్ద కూర పండుగ, పంది కూర పండుగ.. రేపు కుక్క కూర, గాడిద కూర పండుగలు..  అ తర్వాత మనుషుల్ని కూడా కోసుకుతింటారేమో.. ఎవడి తిండి వాడు ఇంట్లో తినక వీధినపడటం ఎందుకు?.. ఎవడి తిండి వాడిష్టం.. మరి ఇలా పండుగల పేరుతో అవతలి వారి మనోభావాలను గేలి చేయడం ఎందుకు?..