Saturday, May 3, 2014

ఇదేం సంస్కారం?..

బస్సులో తమకు కేటాయించిన ముందు సీటులో కూర్చున్నాడో వృద్దుడు..
సీటు కోసం వెతుకుతున్న యువతిని  చూసి, ఇక్కడ కూర్చోమ్మా అని కోరాడు.. ఆమె తటపటాయించింది.. 
పరవాలేదమ్మా నేను నీ తండ్రిలాంటి వాన్ని అన్నాడా వృద్దుడు.. 
ఆ అమ్మాయి చిరు నవ్వుతో వెంటనే ఆ సీటులో కూర్చుంది..
మన దేశంతో పాటు చాలా దేశాల్లో  పెద్దవారు తమకు రక్త సంబంధం లేకున్నా చిన్న వారిలో తమ కూతురునో, కొడుకునో, మనవళ్లనో చూసుకోవడం సహజం.. 
కాని ఆ యువతి స్థానంలో ప్రియాంక వాద్ర ఉన్నుంటే?.. 
నున్ను నాకు తండ్రివా.. నేను నీకు కూతురును ఎలా అవుతాను అని గొడవ పెట్టుకునేదేమో?..

విలువల పతనం..

కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ లో ఓ నటుడి వీరాభిమాని అయిన టీనేజర్, నా కామెంట్స్ ను ఖండిస్తూ బాబూ క్రాంతీ.. అని సంబోధించాడు.. అతడు పుట్టింది 1990లో.. అప్పటికి నా వయస్సు 17 ఏళ్లు.. అతని కన్నా  పెద్దవాన్ని కాబట్టి బాబూ అనే సంబోధన సరికాదు అని చెప్పడానికి తమ్ముడూ.. అంటూ రాశాను.. వెంటనే అతని దగ్గర నుండి వచ్చిన ఎదురు దాడి... ఎవడు నీకు తమ్ముడు.. అని.. అతనిపై నాకు కోపం రాలేదు.. కొందరి సంస్కారం అంతే అని అంతటితో వదిలేశాను..
ఈ విషయాన్ని ఎందుకు ప్రస్థావిస్తున్నానంటే సమాజంలో  పతనమవుతున్న విలువల గురుంచి చెప్పడానికే.. నేను చదువుకున్న వాతావరణంలో సంస్కారానికి పెద్ద పీట ఉండేది.. పెద్దలను గౌరవించాలని, ఎదుటి వారితో సభ్యతగా మాట్లాడాలని, చెడ్డగా మాట్లాడొద్దని ఇంట్లో పెద్దలు, పాఠశాలలో గురువులు చెప్పేవారు.. కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం ఉందా అనిపిస్తోంది.. పెద్దవారిని చాదస్తపు మనుషులుగా చూస్తున్నారు.. దిక్కుమాలిన సినిమాల ప్రభావంతో వరే అన్నయ్యా.. అని పిలుస్తున్న రోజులు ఇవి..
మన పాఠశాల్లో ఉపాధ్యాయులు ఎక్కువ మార్కులు, ర్యాంకులు సాధించాలంటూ విద్యార్థులపై వత్తిడి తెస్తుంటారు.. మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగం అంటూ తల్లిదండ్రులు పోరు పెడుతుంటారు.. ఇలా కోరుకోవడంలో తప్పేమీ లేదు.. కానీ తమ పిల్లలు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరుకునేవారున్నారా అసలు? అనిపిస్తోంది..
దీనికంతటికీ కారణం ఒకటే మన చదువుల్లో నైతిక విద్య లోపించడమే.. కొన్నేళ్ల క్రితం వరకూ కూడా పాఠశాల్లో నీతి కథలు, పద్యాలు, శ్లోకాలు, సూక్తులు చదివించేవారు.. వాటి ప్రభావం విద్యార్థులపై జీవితాంతం ఉండేది.. కానీ ఈనాటి చదువుల్లో ఆ పరిస్థితి ఉందా?...
మరీ బోరు కొట్టిస్తున్నానేమో సెలవు..

Friday, May 2, 2014

యువ జోష్ అంటే ఇదా?..

కాంగ్రెస్ వారి ఎన్నికల ప్రచారంలో యువ జోష్ ప్రకటన చూసి ఏమిటో అనుకున్నా.. కాస్త ఆలస్యంగా అర్థం తెలిసింది..

ఇలా అయితే ఓకేనా?..

ఓటు వేసిన తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇలా తన పార్టీ గుర్తు హస్తంతో ఓటర్లకు అభివాదం చేయొచ్చట.. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ కమలం గుర్తును ప్రదర్శించడం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అట..
ఎన్నికల సంఘం వారూ గమనించారా?...

ప్రధాని రైలు ప్రయాణం..

బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్.. పాపం సీటు దొరకలేదు.. నిలబడే పేపర్ చదువుతూ ప్రయాణిస్తున్నాడు.. ఆయన వెంట కనీసం భద్రతా సిబ్బంది కూడా లేరు.. ఆయన తన కార్యాలయానికి, పార్లమెంట్ కు లోక్ ట్రెయిన్ లోనే వెళతారట..
ఇలాంటి పరిస్థితిని మన దేశంలో కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది..

Thursday, May 1, 2014

శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట..

అలా ఉంది డిగ్గీరాజా యవ్వారం..
ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి రచ్చచేయడం ఇతడి నైజం.. పాపం ఇప్పడు తన విషయం వచ్చేసరికి మింగలేక కక్కలేక, చివరకు లీగలైజ్ చేసుకోక తప్పడం లేదు..
నరేంద్ర మోదీ తన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో భార్య పేరు వెల్లడించగానే.. 'ఇదిగో చూశారా.. ' అంటూ గగ్గోలు పెట్టేశాడు దిగ్విజయ్ సింగ్.. అప్పుడే ఏం చెప్పాడో గమనించండి.. 'నేను మోదీలా నా వైవాహిక స్థితిని దాచను.. నా భార్య చనిపోయింది.. మళ్లీ పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతాను..'
అప్పడే అనిపించింది ' మళ్లీ పెళ్లి' ప్రస్థావన ఏమిటి?.. దాల్ మే కుచ్ కాలా హై అని.. దిగ్విజయ్ మరో పెళ్లి చేసుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు.. ఆయన జీవితం ఆయన ఇష్టం.. కానీ ఇంకా విడాకులు తీసుకోని మహిళతో యవ్యారాలు సాగించి, సోషల్ మీడియాలో రచ్చ అయితే కానీ ఆయనకు సోయి రాలేదా?.. అంటే సోషల్ మీడియా ఈ విషయం బయట  పెట్టకపోతే అనైతిక సంబంధాన్ని నిర్లజ్జగా కొనసాగించేవాడన్నమాట.. పాపం డిగ్గీ తాత తన మనవళ్లు, మనవరాళ్లకు.. నలుగుగు సంతానానికి ఏమి సమాధానం చెప్పుకుంటారో..
ఇలాంటి చిత్తకార్తె మనుషులకు సమాజమే తగిన బుద్ది చెప్పాలి..

మీడియాకు ఓటు వద్దా?

ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్థంభం అంటారు.. ఓటు విలువ గురుంచి ప్రజలకు చెబుతుంది మీడియా.. కానీ ఎంత మంది జర్నలిస్టులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు?
ఎన్నికల రోజున అందరికన్నా హడావుడిగా ఉండేది పోలింగ్ విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది, పోలీసులు.. ఆ తర్వాత మీడియా వారే.. కానీ వారంతా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి పోస్టల్ బ్యాలట్ పద్దతిలో ఓటు వేస్తారు.. మీడియా వారి పరిస్థితే రెంటికీ చెడ్డ రేవడి అవుతోంది..
పోలింగ్ రోజున పొద్దటి నుండి రాత్రి వరకూ విధుల్లో ఉండే మీడియా సిబ్బందిలో అత్యధికులు ఓటు హక్కును ఉపయోగించేకోలేని దుస్థితిలో ఉన్నారు.. షిప్ట్ డ్యూటీలో ఉన్నవారు ఏదో సమయంలో ఓటు వేసే వెలుసుబాటు ఉంది.. కానీ ఓటు ఎక్కడో ఉంది.. విధులు మరోచోట నిర్వహించేవారు ఓటు వేయలేకపోతున్నారు.. నిన్నటి రోజున చాలా మంది జర్నలిస్టులు ఇదే విధంగా ఓటు హక్కు కోల్పోయారు..

ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలను అందించే మీడియా కూడా అత్యవసర సర్వీసే.. వారిది ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారికన్నా ఎన్నోరెట్లు కష్టపడుతున్నారు.. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలి.. మీడియా సిబ్బందికీ పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఇవ్వాలి.. ఈ విషయంలో జర్నలిస్టు సంఘాలు పలుమార్లు మొరపెట్టుకున్నా స్పందన కనిపించలేదు.. ఏం చేస్తాం ప్రతి ఒక్కడూ మీడియాను వాడుకొని వదిలేసేవాడే..