Friday, April 4, 2014

పగటి కలలు..

సినిమాలు రాక ముందు తోలు బొమ్మలాటలో కేతిగాడు అనే పాత్ర ఉండేది..
కొందరు నాయకులను చూస్తే ఆ పాత్రే గుర్తుకు వస్తుంటుంది..
సీఎం పదవి వదులుకోడానికి దమ్ముండాలి అంటారీయన.. మీకు దమ్ము, దగ్గు, జలుబూ అన్ని ఉన్నాయని జనానికి తెలుసు..
అడ్డగోలు వాగ్దానాలు ఇచ్చి, అమలు చేయడం చేతగాక మఖ్యమంత్రి పదవిని వదిలేసీ పారిపోయిన విషయమూ తెలుసు..
ఉల్టా చోర్ కోత్వాల్ కో మారా.. అన్నట్లు తన వైఫల్యాన్ని బీజీపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నదీ తెలుసు..
ఈ కేతిగాడు పాత్రను ఆడిస్తుంది ఎవరో అందరికీ తెలుసు..
ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీపై పోరాటం చేస్తారు.. కానీ ఈయన తలపడుతున్నది అధికారపక్షంతో కాదు.. ప్రతిపక్ష నేతతో పోరాడుతున్నాడు.. ప్రధాన మంత్రి పదవి కోసం పోరాడుతున్ననాయకునిపై తాను పోటీ చేస్తూ ఆయన్ని ఓడిస్తానని గొప్పలకు పోతున్నాడు.. కానీ తనను ఆడిస్తున్న యువరాజాపై మాత్రం తేలికగా ఓడిపోయే బకరాను పోటీకి పెట్టేశాడు..
మోడీని ఓడిస్తాడట.. నిజమే.. కలలో కావచ్చు..

Thursday, April 3, 2014

కాంగ్రెస్సే పెద్ద మతతత్వ పార్టీ

కాంగ్రెస్సే పెద్ద మతతత్వ పార్టీ అంటున్నారు సయ్యద్ యాహ్యా బుఖారీ.. ఢిల్లీ జామా మసీద్ షహీ ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ తమ్ముడీయన.. కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతు పలుకాలన్న తన అన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు యాహ్యా.. ఆయన ఇంకా ఏమన్నారో గమనించండి..
బీజేపీని మతతత్వ పార్టీ అని ముస్లింలు అంటారు.. ఆ పార్టీ చెప్పాల్సింది నేరుగా చెప్పేస్తుంది.. కానీ కాంగ్రెస్ అలా కాదు వెన్నుపోటు పొడుస్తుంది.. గత మూడున్నద దశాబ్దాలుగా  చూస్తే భాగల్ పూర్, మీరట్, మొరాదాబాద్, సూరత్ తదితర అల్లర్లు కాంగ్రెస్ హయాంలో జరిగినవే.. అమాయక ముస్లింలను జైలుకు పంపారు.. కాంగ్రెస్ పార్టీయే అత్యంత మతతత్వ పార్టీ.. దానికి మద్దతు ఇవ్వడం సరికాదు..

విన్నారా సయ్యద్ యాహ్యా బుఖారీ గారి మాటలు..

నో చెవిలో పువ్వెట్టింగ్..

ఎన్నికలు జరిగే సమయంలో, నో చెవిలో పువ్వెట్టింగ్..
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీద కనిపించిన ఐడియా మొబైల్ ప్రకటన చూసి తెలుగు భాషను మరీ ఇంతగా ఖూనీ చేశారేంటి అనుకున్నా.. నో చెవిలో పువ్వెట్టింగ్ కాస్త సంకర భాషా ప్రయోగంలా అనిపించింది.. కానీ ఆలోచించి చూస్తే ఈ ప్రకటనలో భాష కాదు, భావం ప్రధానం అనిపించింది..
సోషల్ మీడియా విస్తరించిన ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు మాట మార్చినా, తప్పినా జనం కడిగిపారేస్తున్నారు.. ముఖ్యంగా ఎన్నికల వేళ నాయకులు కాస్త నోరు దెగ్గర పెట్టుకోవాల్సిందే.. గతంలో మాదిరిగా చెవిలో పూవు పెడతామంటే కుదరదు..
ప్రజల్లో వచ్చిన చైతన్యానికి ఐడియా ప్రకటన అద్దం పడుతోంది అనిపించింది..
నిజమే కదూ.. ఎన్నికలు జరిగే సమయంలో నో చెవిలో పూవెట్టింగ్..

Wednesday, April 2, 2014

ఆంధ్రప్రదశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ భన్వర్ లాల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఓట్లర్లతో పాటు అభ్యర్థులకు తెలియజేయడానికి కొంత  పుంతలు తొక్కుతున్నారు.. పత్రికల్లో వస్తున్నఈ ప్రకటనలు చూడండి.. ఏకంగా ఇంటింటా పాపులర్ టీవీ యాంకర్ సుమను కూడా భాగస్వామిని చేసేశారు.. హ్యాట్సాప్ భన్వర్ లాల్ సాబ్..

నగ్మాకు కాంగ్రెస్ నుండి రక్షణ కావాలట..

మీరట్ లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగ్మాకు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు, స్థానిక కార్యకర్తలు, అభిమానుల నుండి ముప్పు పొంచి ఉందట.. అందువల్లకు ఆమెకు భద్రత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి లేఖ రాసింది.. (వెబ్ దునియాలో వచ్చిన ఈ వార్తను చదవండి) మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ వారికి ఎంత గౌరవం ఉందో చూడండి.. సొంత పార్టీ వారినే నమ్మడం లేదు.. తమ అభ్యర్థలనే కాపాడుకోలేని వారు మళ్లీ అధికారంలోకి వస్తే దేశాన్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది..
పాపం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వీరనారి రహీమున్నిసా కూడా టీఆర్ఎస్ ను వదిలేసింది.. ఉద్యమకారులకు అసలు విలువలేదా?.. ఎటు పోతోంది ఈ పార్టీ?.. ఆమె ఆరోపణలకు జవాబేది?.. నిన్న చెరుకు సుధాకర్.. ఇప్పడు రహీమున్నిసా.. రేపు ఎవరు?

Tuesday, April 1, 2014

కుమార్ విశ్వాస్ దిగజారుడు మాటలు..

రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేఠీ నుండి స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారనే వార్త రాగానే, అక్కడి నుండి ఆప్ అభ్యర్థిగా బరిలో ఉన్నకుమార్ విశ్వాస్ 'ఇరానీ, పాకిస్తానీ..' అంటూ అవహేళనగా మాట్లాడారు.. మహిళలపై గౌరవం లేని ఈ నీచుడి ప్రవర్తనకు ఇదో మచ్చుతునక.. గతంలో ఇతగాడు మహిళలకు కించపరుస్తూ మాట్లాడిన తీరును అందరూ యూ ట్యూబ్ లో చూసే ఉంటారు.. ఇలాంటి వెధవలను మహిళా సంఘాలు ఎందుకు పట్టించుకోవడం లేదు?