Friday, January 11, 2019

కుసంస్కారం

స్త్రీలను గౌరవించడం భారతీయ సంప్రదాయం.. అందుకే రాహుల్ గాంధీకి ఈ సంప్రదాయ విలువలు తెలియవేమో..
రఫేల్ ఒప్పందం గురుంచి అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఆయన్ని ఉతికి ఆరేసింది.. రాహుల్ దీన్ని జీర్ణించుకోలేక నిర్మల సీతారామన్, ప్రధాని నరేంద్ర మోదీలను నోటికొచ్చినట్లు తూలనాడుతున్నారు. రక్షణ మంత్రిని అవమానించిన రాహుల్ సంజాయిషీ ఇచ్చుకోవలని జాతీయ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది.. రాహుల్ అబద్ధాలను నిజాలుగా చూపే క్రమంలో వివేకాన్నే కాదు, సభ్యతా సంస్కారాలు కూడా కోల్పోతున్నారు..

Tuesday, January 8, 2019

రిజర్వేషన్ల విధానం మారాల్సిందే..


ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో అసలు ఈ విధానంపైనే సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇలా అంటున్నానని నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం అని భావించాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్లు కచ్చితంగా ఉండాల్సిందే.. కానీ ప్రస్తుత రూపంలో కాదు..
భారత రాజ్యాంగం ప్రకారం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్ష నిషేధం.. దేశ ప్రజలందరినీ సమాన అవకాశాలుటు కల్పించింది రాజ్యాంగం.. అయితే ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లను ఇచ్చారు. మొదట పదేళ్ల పాటు అనుకున్నారు ఈ రిజర్వేషన్లు.. కానీ ఓటు బ్యాంకు రాజకీయాల పుణ్యాన కాల పరిమితిని పెంచుతూ పోయారు మన నాయకులు. కాలక్రమంలో మరికొన్ని కులాల రిజర్వేషన్ల జాబితాలోకి తెచ్చారు. రాను రాను ఇతర కులాల నుంచి కూడా రిజర్వేషన్ల కోసం ప్రభుత్వాలపై వత్తిడి పెరుగుతూ వస్తోంది..
రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాలా, సామాజిక వెనుకబాటు ప్రాతిపదికనా అనే విషయంలో మొదటి నుంచి అనేక వాదనలు ఉన్నాయి. ప్రతి కులంలోనూ పేదలు ఉన్నారు. రిజర్వేషన్లను కొన్ని వర్గాలకే పరిమితం చేయడం వల్ల ఎంతో మందికి అన్యాయం జరుగుతోంది.
కాలంతో పాటు సమాజం కూడా ఎంతో మారిపోయింది. ఒకనాడు వివక్షను, వెనుకబాటు తన్నాన్ని ఎదుర్కొన్న కులాలు ఈనాడు ఆ పరిస్థితిలో లేవని అందరూ ఒప్పుకోక తప్పదు. అగ్రకులాలు అని చెప్పబడుతున్న కులాలలో పోలిస్తే వారే ఎక్కువ సంఘటితంగా ఉన్నారు. వారు కూడా రాజకీయంగా, ఆర్థికంగా బలపడ్డారు.. వీరిలో సంపన్న శ్రేణిని (క్రీమీ లేయర్) గుర్తించి వారిని రిజర్వేషన్లకు దూరంగా ఉంచడం అన్ని విధాలా సమంజసం. అలాగే ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నట్లుగా ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొందిన వారికి రెండోసారి అవకాశం ఇవ్వకపోవడం లేదా తగ్గించడం అమలు చేయాలి..
ఆకలికి, పేదరికానికి కులం లేదు.. అన్ని కులాల్లోనూ పేదలు ఉన్నారు. కాబట్టి కుటుంబ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వడం అన్ని విధాలా సమంజసం.. ధనమూలం ఇదం జగత్ అని మన పెద్దలు అన్నారు. ధనవంతుడు తన పిల్లలతో వ్యాపారం చేయించి స్వయం ఉపాధి కల్పిస్తాడు.. వారి పిల్లలు పెద్ద చదువులు చదివించి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. కానీ పేదవారికి అన్ని అవకాశాలు ఎక్కడుంటాయి.. చదువు కొనేఈ రోజుల్లో కులాన్ని ఎవరు చూస్తున్నారు?.. అందుకే డబ్బు లేనోళ్లకు రిజర్వేషన్ల అవసరం ఎక్కువ..
మన దేశంలో రిజర్వేషన్ల కారణంగా ఎంతో మంది వ్యక్తులకు, కుటుంబాలకు మేలు జరిగింది.. అదే సమయంలో ఇవే రిజర్వేషన్ల కారణంగా అన్యాయాలు కూడా జరిగాయి.. బాధితులకు కడుపు మంట సహజం.. ఎందుకు ఈ విషయం ప్రస్థావిస్తున్నానంటే నేను కూడా రిజర్వేషన్ల కారణంగా అవకాశాలు కోల్సోయిన బాధితున్ని.. సోకాల్డ్  కులంలో పుట్టడమే నేను చేసిన పాపమేమో అని దు:ఖపడ్డ రోజులు ఉన్నాయి..
ప్రస్తుత రిజర్వేషన్ల పద్దతి ఉన్నంత కాలం బాబా సాహెబ్ అంబేద్కర్ కోరకున్న కుల రహిత సమాజం ఏర్పడదు.. నేను ఏ కులానికి వ్యతిరేకిని కాదు.. పేదల పక్షపాతిని మాత్రమే.. అందుకే నేను అర్ధిక ప్రాతిపదిక రిజర్వేషన్లను సమర్ధిస్తున్నాను..


Thursday, January 3, 2019

వందేమాతర గీతం వరుస మార్చిన కాంగ్రెస్

మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర సచివాలయంలో ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగలంతా ఆలపించే వందేమాతరం గీతాలాపన నిల్పి వేసింది.. ఇది కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు.. ఆ పార్టీ మొదటి నుంచి కూడా వందేమాతరానికి వ్యతిరేకం.

స్వాతంత్రానికి పూర్వం బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతాన్ని కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో ఆలపించేవారు. కానీ 1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో పార్టీ అధ్యక్షునిగా ఉన్న మహ్మద్ అలీ వందేమాతరం గీతాన్ని వ్యతిరేకించి వేదిక దిగి వెళ్లిపోయారు. ముస్లింలీగ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అలీ సోదరుల నిరసన కారణంగా మహాత్మాగాంధీ వందేమాతరానికి పక్కన పెట్టారు.. వందేమాతరంలో దేవతార్చన విగ్రహారాదన అవుతుంది గనక తమకు అభ్యంతరమని వారు చెప్పడంతో కాంగ్రెస్ పెద్దలు రాజీ మార్గానికి వచ్చారు. నాలుగు చరణాలు ఉన్న వందేమాతరాన్ని కేవలం ఒక చరణానికి పరిమితం చేశారు..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా వందేమాతరం స్వీకరించేందుకు ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇష్ట పడలేదు. దీంతో ‘జనగనమన’ మన జాతీయ గీతమైంది. అయితే ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ చొరవ తీసుకొని వందేమాతరానికి కూడా జాతీయ గీత హోదా ఇచ్చారు..
సంతృష్టీకరణ రాజకీయాల రుచి మరిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొత్తానికే వందేమాతరం గీతానికి ఎసరు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో మొదటి మెట్టు మధ్యప్రదేశ్ సచివాలయంలో వందేమాతరంపై నిషేధం..

ఇంతకీ వందేమాతరం అంటే అర్థం తెలుసా?.. 'అమ్మా వందనం' అని.. దేశాన్ని తల్లిగా భావించి పూజించడం, గీతాన్ని అలపించడం కూడా మతతత్వంగా కనిపిస్తోంది కొందరికి.. అరె బాబులూ.. వందేమాతరం గీతం ఆరెస్సెస్, బీజేపీ పుట్టక ముందు నుంచే ఈ దేశంలో ఉందిరా.. తల్లిలాంటి దేశాన్ని కీర్తించినంత మాత్రాన మీరు మతతత్వ వాదులు అయిపోరురా..

Wednesday, January 2, 2019

ఇదేం సెక్కులరిజం?


నిజమైన భక్తులు ఎంతో నియమ నిష్టలతో ఆలయానికి వస్తారు.. కానీ దొంగలకు భయం, భక్తి ఉండవు.. అలాగే రాక్షసులు ధర్మాన్ని నాషనం చేసేందుకు ఎల్లవేళలా కాచుకొని ఉంటారు.. అన్య మతస్తులు విద్వేషంతో మన ధర్మంపై దాడికి వస్తారు?
మరి వీరెవరు?
పవిత్ర శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయంలోకి వారు వచ్చిన తీరు చూస్తే దొంగల్లాగే ఉన్నారు.. సాంప్రదాయాలకు ఉల్లంఘించిన తీరు చూస్తే రాక్షస సంతతే అనిపిస్తోంది. కనీసం కట్టూ బొట్టు లేని వీరు మన ధర్మీయులు మాత్రం కాదు.. సుప్రీం కోర్టు తీర్పు సాకుతో, లింగ సమానత్వం ముసుగులో, నకిలీ ఇరుముడులతో వచ్చిన వీరిని ఏమనాలి ఇంతకు?
కేరళ వామపక్షుల బరి తెగింపు ఇది.. తమ ప్రభుత్వం అండ చూసుకొని అయ్యప్ప ఆలయంలో ప్రవేశించిన ఆ పార్టీ కార్యకర్తలు మన ధర్మంపై దాడికి వచ్చారు.. ఇదే దుస్సాహసం అన్య మతస్తుల ప్రార్థనాలయాల విషయంలో చేయగలరా?.. సెక్యులరిజం ముసుగులో ఇలాంటి వెర్రి తలలను ఇంకా భరించాల్సిందేనా? ఈ దేశంలో మెజారిటీ ప్రజల సహనాన్ని అసమర్ధతగా భావిస్తున్న వీరికి కచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే..
ధర్మో రక్షతి రక్షిత: మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి.. అదే మనల్ని రక్షిస్తుంది.
.

Tuesday, January 1, 2019

క్యాలెండర్ మారితే హంగామా ఎందుకు?

డిసెంబర్ తర్వాత ఏమొస్తుంది?.. జనవరి.. అంతే కదా..
మరి 31వ తేదీ తర్వాత?.. మళ్లీ 1వ తేదీతో కొత్త నెల..
అలాగే 2018 తర్వాత 2019 వస్తుంది.. క్యాలెండర్ మారిపోతుంది అంతే..
ఇంత మాత్రానికే హడావుడి ఎందుకు?.. జనవరి 1 మనకు పండుగ కాదు.. క్యాలెండర్ మార్పు మాత్రమే.. న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేసుకుంటే, ఎంజాయ్ చేస్తే తప్పు ఏమిటి అంటారా?.. అది మీ ఇష్టం.. కేక్ కట్ చేసుకుంటారో, మందు కొడతారో, డాన్సులు చేస్తారో చేసుకోండి..
కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకండి.. పెద్ద సౌండ్ పెట్టి, వెర్రి కేకలు వేసి నిద్రపోయే వారిని ఇబ్బంది పెట్టకండి.. తాగిన మైకంలో రోడ్ల మీద అడ్డగోలు వేగంతో వాహనాలు నడపకండి.. మీ చావు మీరు చేస్తే ఎవరికి నష్టం లేకపోవచ్చు.. కానీ మీ పిచ్చ ఆనందం కోసం ఎదుటి వారి ప్రాణం తీసే స్వేచ్ఛ మీకు లేదు.. 
ఒక సనాతన ధర్మ విశ్వాసకునిగా, తెలుగు వాడిగా నేను ఉగాదిని సంవత్సరాదిగా జరుపుకుంటాను.. ఆ రోజే పండుగ చేసుకుంటాను..
మీరు నమ్మే న్యూ ఇయర్ నిషాచారులు తిరిగే అర్ధరాత్రి వస్తే, నా సంవత్సరాది లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడిని మేలుకొలిపే సుప్రభాత వేళ ప్రారంభం అవుతుంది.. అర్ధరాత్రి మన నిద్ర చంపుకొని, అవతలి వాడి నిద్రను పాడు చేసే అవసరం లేదు.. అడ్డగోలుగా తాగి వాహనాలు నడిపి ప్రాణాలు తీయడం, తీసుకోవాల్సిన అవకాశం లేదు..
చివరగా క్యాలండర్ మార్పు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

Monday, April 30, 2018

Monday, April 2, 2018

పంచ్.. పంచ్

01.04.2018
ఎవరక్కడ.. ఆ మానసిక విశ్లేషకున్ని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించండి

Saturday, March 31, 2018

ఇదేం పొగడ్త రాజు గారూ?



ఇంతకీ పొగిడారా?.. తిట్టారా?..
అశోక్ గజపతిరాజు గారికి ఎలాగూ తెలుగు రాదు కాబట్టి ఇలా తిట్టేసి మానసిక ఆనందడం పొందుతున్నారా? అసలు తెలుగు పేరుతో ఉన్న పార్టీలో ఈ తెగులు ఏమిటీ? బాబు గారు మీరు అధికార భాషగా తెలుగును ఎలాగూ అమలు చేయలేరు.. కనీసం మీ కార్యకర్తలకు అయినా తెలుగు నేర్పించండి..
29.03.2018

ఇదే రామ తత్వం



ఎవరు ఈ రాముడు?.. ఎందుకు ఆయనపై ఇంత భక్తి?.. యావత్ భారత దేశమంతా ఆయన్ని ఎందుకు పూజిస్తోంది?.. విదేశాల్లో సైతం రామాయణ గాథను ఎందుకు ఇష్టపడుతున్నారు?.. అసలు రామాయణంలో ఏముంది?..
మన తెలుగు నాట భక్తి అంటే ముందు రాముడే గుర్తు వస్తాడు.. శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి, పంచవటి తెలుగు నాట ఉండటం మనం చేసుకున్న పుణ్యం.. దాదాపుగా ఊరూరా రామాలయం సర్వసాధారణం.. ప్రతి ఊరిలో రామయ్య, రామశాస్త్రి, రామారావు, రాంరెడ్డిలు కనిపిస్తారు..
ఇక శ్రీరామ నవమి వచ్చిందంటే పండగే.. చలవ పందిళ్లు వేసి రాముని జయంతి, కల్యాణం, పట్టాభిషేకం కన్నుల పండువగా నిర్వహిస్తాం.. రామరసాన్ని తాగుతాం.. ఈ రాముడు, రామభక్తి తెలుగు నేలకే పరిమితం కాదు.. అయోధ్యలో జన్మించిన రాముడు అరణ్యవాసంలో భాగంగా సీత, లక్ష్మణులతో కలసి దేశమంతా తిరిగాడు.. చివరగా లంకకు వెళ్లి రావణున్ని వధించి, అయోధ్యకు చేరుకొని పట్టాభిషక్తుడయ్యాడు. ఇలా యావత్ భారతదేశం రాముని పాద స్పర్శతో తరించింది. 
రామాయణ గాధ దేశ సరిహద్దులను కూడా దాటి ప్రపంచ దేశాలను చేరింది.. ఇండోనేషియా, థాయ్ లాండ్, కాంబోడియా లాంటి తూర్పు ఆసియా దేశాల్ని సైతం రామాయణం ప్రభావితం చేసింది. చరిత్రలో తొలి ప్రపంచ ఆధ్యాత్మిక కథ శ్రీమద్రామాయణమే అని చెప్పక తప్పదు..

రాముని కథ ఎన్నిసార్లు చదివినా, విన్నా తనివి తీరదు.. అందుకే వాల్మీకి మహర్షి రాసిన రామాయణానికి తోడు ఎందరో కవులు, పండితులు ఈ గాథను రాశారు.. మళ్లీ మళ్లీ రాస్తున్నారు.. అదే రామాయాణానికి ఉన్న విశిష్టత.. 
శ్రీరామచంద్రుడు సకల సద్గుణాలు, పెద్దలపట్ల వినయ విధేయతలు కలవాడు.. ప్రజల పట్ల ఆత్మీయత, సేవకులపై ఔదార్యం చూపించాడు. శత్రువులను కూడా దయాగుణం చూపించాడు.. మాతృ-పితృ భక్తితో ఆదర్శ తనయునిగా, ఏకపత్నీవ్రతంతో ఆదర్శ భర్తగా, తోబుట్టువుపై మమకారంలో ఆదర్శ సోదరునిగా, గురువు ఆనతో రాక్షస సంహారం చేసిన ధర్మ రక్షకునిగా, ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని పాలించిన ఆదర్శ ధర్మపాలకునిగా, నమ్మిన మిత్రులకు రక్షకునిగా.. ఇలా ఎన్నో వైవిధ్య రూపాలల్లో రాముడు కనిపిస్తాడు.. భక్తుల పట్ల శరణాగత వాత్సల్యం, కృతజ్ఞత-క్షమా హృదయం, పరాక్రమం, ప్రజారంజక పాలక.. ఇలా ఎన్నోలక్షణాలు మనకు ఆదర్శప్రాయంగా కనిపిస్తాయి.. 
అలాగే రామాయణంలోని పాత్రన్నీ విశిష్టతగలవే.. రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, క్షత్రజ్ఞుడు, ఆంజనేయుడు. కౌసల్య, కైకేయి, విశ్వామిత్రుడు, శబరి, అహల్య, అగస్త్యుడు, గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు.. ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో విశిష్ట ఉంది.. 
రాముడైనా, రామాయణ గాథ అయినా ఒక తరానికి పరిమితం కాలేదు. ఇది పురాణ కథగా మాత్రమే భావించలేం.. మన తాత ముత్తాతలు, తండ్రులు అందించ రామాయణ సందేశాన్ని మన పిల్లలకు అందించాలి.. వారు భావి తరాలకు చాటి చెప్పేలా ప్రోత్సహించాలి.. మన కుటుంబ విలువలు, ప్రేమ, అన్యోన్యత, అనురాగం రామాయణంతో ముడిపడి ఉన్నాయి.. 
గాంధీజీ స్వాతంత్ర్యం తర్వాత రామరాజ్యం కావాలని కోరుకున్నారు.. రామరాజ్యం అంటే ఆదర్శ పాలన.. దురదృష్టవశాత్తు ఈ రోజున రాముడు అంటే ఒక మతానికి పరిమితమైన వ్యక్తిగా చూస్తున్నారు.. రాముడు పుట్టిన జన్మభూమి వివాదాస్పదమైపోయింది. రాముడిన మన నుంచి ఎవరూ దూరం చేయలేరు.. సూర్య చంద్రులు ఉన్నంత కాలం రాముడు మనతో ఉంటాడు.. శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ ఆయన కురుణా కటాక్షాలు శుభం కలగాలి అని కోరుకుంటూ.. జై శ్రీరామ్..
26.03.2018

రాములవారికి గులాబీ అలంకరణ?




భద్రాచల క్షేత్రంలో ఏమిటీ ఘోరం.. కాషాయం నచ్చకుంటే శ్వేత వస్త్రాలతో అలంకరించండి.. ఈ గులాబీ రంగు ఎందుకు? ఇది రాముల వారి కల్యాణమా?.. టీఆర్ఎస్ వారి ఇంట వివాహ వేడుకనా?.. రామచంద్ర ప్రభూ.. వారికి సద్బుద్ధి ప్రసాదించు.. ఇంతటి తప్పిదానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి..
25.03.2018

రోజుకు ఎన్ని గంటలు బాబు?





రోజుకు 24 గంటలే కదా ఉండేది.. బహుషా వారానికి 36 గంటలు పని చేస్తున్నారు అనుకుంటా.. 🤔

24.03.2018
🤔
🤔


2

గడ్డి తిన్న పాపానికి..

పశుగ్రాస కుంభకోణం కేసులన్నింటిలో లాలూ ప్రసాద్ యాదవ్ 20 ఇళ్లకు పైగానే జైళ్లో ఉండబోతున్నారు.. 
లాలూకు జైళ్లో మూడు పూటలా గడ్డి పెట్టాల్సిందే.. అంతే కాదు ఈ గడ్డి కూడా ఆయన తోనే పెంచిపిస్తే ఇంకా బాగుంటుంది..
మునుముందు ఇలాంటి కుంభకోణాలు చేయకుండా రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలి..

24.03.2018

సెక్యులర్ సైకోన్మాదం



తమిళనాడులో పట్టపగలు కొందరు సైకోలు శ్రీరామచంద్రుని చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ ఊరేగిస్తున్న ఈ దృశ్యాలు ఇవి.. మెజారిటీ హిందువులకు స్వాభిమానం, చీము నెత్తురు లేవు కాబట్టి ఇలాంటి ఘటనలు రాబోయే రోజుల్లో కూడా సర్వసాధారణం కావచ్చు.. ఇదే ఘటన ఇతర మతస్తుల విషయంలో జరిగి ఉంటే ఏమయ్యేది?.. 
సెక్యులర్ పెక్యులర్స్ అంతా గోల చేసేవారు కాదా?.. ద్రవిడవాదం, పెరియార్ పేరు చెప్పుకునే ఈ విచ్చిన్నకర శక్తుల వెనుక ఉన్నది ఎవరు.. పక్కనే ఉన్న పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
శ్రీలంకలో ఈలం పేరిట ప్రత్యేక దేశం కోసం పోరాడిన ఎల్టీటీఈకి మద్దతు ఇచ్చిన వారు ఈ రోజు మరోసారి ద్రవిడస్థాన్ పేరుతో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నారు. తమిళనాడును విడదీయాలి అనేది వారి దీర్ఘకాలిక కుట్ర. దీనికి ద్రావిడవాదం, పెరియారిజం అనేవి ముసుగులు.. రామున్ని అవమానిస్తున్న సైకో బ్యాచ్ అంతా ఈ విభజన మనస్థత్వం కలవారే.. కేవలం తమిళనాడు ఉంటే సరిపోదని దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలిపి ద్రవిడస్థాన్ ఏర్పడాలంటున్నారు ఈ విద్రోహులు.. భారత దేశంలో భాగంగా ఉన్న తమిళనాడులో హిందువుల విశ్వాసాలకు ఇంతటి అవమానం జరుగుతుంటే, ఈ సైకోలు కోరుకునే ద్రవిడస్థాన్ వస్తే ఏమౌతుందో ఆలోచించారా?.. 
తెలిసో తెలియకో ద్రవిడస్థాన్ కావాలి, దక్షిణ భారత దేశం విడిపోవాలి అనే వాదించే మన తెలివి తక్కువ తెలుగు వితండ వాదులకు కూడా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను.. రామున్ని అవమానించిన వారు రేపు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తారు.. అప్పుడు ఈ సెక్కులర్ పాఠాలు వళ్లించే పెక్యులర్స్ ఎవరూ నిన్ను రక్షించేందుకు రారు అన్నది గుర్తుంచుకో..
22.03.2018

సెక్యులర్ మానవత్వం నిద్రపోయిందా?



సిరియా అంతర్యుద్ధంలో వాళ్లు వాళ్లు కొట్టుకు చస్తుంటే మన దేశ 'సెక్యులర్స్' గగ్గోలు పెట్టి కన్నీరు కార్చి మానవత్వం గురుంచి ఉపన్యాసాలు ఇచ్చారు..
మరి పొట్ట కూటి కోసం ఇరాక్ వెళ్లిన భారతీయ కూలీలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే ఏ ఒక్కరూ స్పందించరేం.. కన్నీటి చుక్కలు మిగలలేదా?.. నోళ్లు పెగలలేదా?.. మన తోటి భారతీయుల ప్రాణాలకు విలువలేదా?

21.03.2018

ఉగాది శుభాకాంక్షలు..




మామిడి పూవుకు మాట వచ్చింది..
కోయిల గొంతుకు కూత వచ్చింది..
వేప కొమ్మకు పూత వచ్చింది..
పసిడి బెల్లం తోడు తెచ్చింది..
గుమ్మానికి పచ్చని తోరణం తెచ్చింది..
ఉగాది పండుగ మన ముందుకొచ్చింది..
బంధు మిత్రులు, హితులు, శ్రేయోభిలాషులు అందరికీ..
18.03.2018

ఫడ్నవీస్ చాతుర్యం



ముంబై మహా నగరంలో ఇటీవల రెండు భారీ ర్యాలీలు జరిగాయి.. కొద్ది వారాల క్రితం మరాఠాలు రిజర్వేషన్ల కోసం ఉద్యమించారు.. తాజాగా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం భారీ పాదయాత్ర జరిపారు.. ఈ రెండు ప్రదర్శనలు ముంబై నగరంపై ఉప్పెనలా వచ్చి పడ్డాయి.. లక్షలాది మంది వీధుల్లో కదం తొక్కారు.. పూర్తి క్రమశిక్షణతో జరిగిన ఈ రెండు ర్యాలీలో ఎక్కడా అవాంఛనీయ ఘటలు జరగలేదు..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ర్యాలీలకు అనుమతి ఇవ్వడమే కాదు, అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా పోలీసు భద్రత కల్పించారు.. ర్యాలీలు నిర్వహించిన వారితో చర్చించి వారి సమస్యలు ఎంత మేరకు పరిష్కరించడం సాధ్యమో ఆ మేరకు హామీ ఇచ్చారు.. అప్పుడు మరాఠాలు, ఇప్పుడు రైతులు ఫడ్నవీస్ హామీతో సంతృప్తి చెంది నిరసనలు విరమించారు
ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి ముంబై వచ్చిన రైతులు తిరిగి స్వస్థలాలకు వెళ్ళడానికి ఫడ్నవీస్ రవాణా సౌకర్యం కూడా కల్పించారు..
ఇప్పుడు మన తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లకు వద్దాం.. ఉద్యమాలు అనగానే మన ఇద్దరు సీఎంలకు వణుకు. ప్రదర్శన, సభలకు అనుమతి నిరాకరణ.. నాయకుల ముందస్తు నిర్బంధం, అరెస్టులు శరా మామూలే.. అంతే కాదు ఇక్కడి ఉద్యమకారుల్లో కూడా అంతటి క్రమశిక్షణ కనిపించదు..
ప్రభుత్వాలు అన్నప్పుడు ప్రజా ఉద్యమాలు ఎదుర్కోక తప్పదు.. వారి డిమాండ్లు, కోర్కెల సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే అధికారంలో ఉన్నవారు తమ పరిధిలో ప్రయత్నం చేస్తే కొంతైనా పరిష్కరించడం సాధ్యమే.. ఈ విషయంలో వయసులో చిన్నవాడైనప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను చూసి నేర్చుకోక తప్పదని చెప్పగలను..
13.08.2018

జిన్ పింగ్ నియంత రూపం



నేతి బీరకాయలో నెయ్యి ఎంతో చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రజాస్వామ్యం అంతే.. దేశాధ్యక్షుడు ఎవరు కావాలి అనేది పొలిట్ బ్యూరో అనే ఓ ముఠా నిర్ణయిస్తుంది. ఈ ముఠాను బాగా చూసుకునేవాడు ఉత్తుత్తి ఓటింగ్ ద్వారా దేశాధినేత అవుతాడు.. ఈ ముఠాపై మంచి పట్టు సంపాదించిన షీ జిన్ పింగ్ ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు శాశ్వతంగా దేశాధినేతగా ఉండేందుకు ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేశాడు. 

చైనా పేరుకు మాత్రమే కమ్యూనిస్టు దేశం.. ఆచరణ అంతా పెట్టుబడిదారి విధానమే.. ఇప్పుడు ఈ పెట్టుబడిదారి కమ్యూనిస్టు దేశానికి జీవితాంత (శాశ్వత) అధ్యక్షుడు జిన్ పింగ్.. పార్టీ, సైన్యంపై ఇప్పటికే పట్టు సాధించి, అవినీతిపై యుద్దం పేరిట ఎంతో మంది ప్రత్యర్థులను జైలుకు పంపి భయోత్పాతం సృష్టంచిన జిన్ పింగ్ నియంతృత్వానికి తెర తీశాడు. మళ్లీ మావో కాలంనాటి భయోత్పాత దినాలు దాపురించాయని చైనీయులు ఆందోళనతో ఉన్నారు. వీరికి ఉన్న ఏకైన గొంతుక సోషల్ మీడియాను కూడా చైనా కమ్యూనిస్టు పార్టీయే నియంత్రిస్తోంది..
జిన్ పింగ్ చైనాకు శాశ్వత అధినేతగా ఉండటం భారత్ ప్రయోజనాలకు ఇబ్బందికమే.. ఇప్పటికే చైనా అడుగడుగునా మనకు వ్యతిరేకంగా పని చేస్తోంది. పాకిస్తాన్ లో ఎకనామిక్ కారిడార్ నిర్మించడంతో పాటు ఆ దేశ ఉగ్రవాద చర్యలను గుడ్డి సమర్ధిస్తోంది చైనా.. నేపాల్, శ్రీలంక, మాల్దీవులను ఆర్థిక సాయం పేరిట స్థావరాలు ఏర్పాటు చేసుకొని మన దేశాన్ని దిగ్భందించే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల డోక్లామ్ లో భారత సైన్యం నిలువరించడంతో భంగపడ్డ చైనా, అదను కోసం ఎదురు చూస్తోంది. ఇప్పడు నియంతగా మారుతున్న జిన్ పింగ్ పట్ల మన దేశం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
12.03.2018

ఈ విషయంలో బాధ లేదా?

అడ్వాణీ గారిని మోడీ గారు అవమానించారని కాంగ్రెస్ మిత్రులు బాధపడిపోతున్నారు.. మరి ఈ ఫోటోలకు కూడా బాధపడే ఉండాలి.. 11.03.2018

ఇదొకరకం జిజియా పన్ను

పూర్వం ఔరంగజేబు జిజియా పన్ను వేశారని చరిత్రలో చదివాను.. ఇప్పుడు సెక్యులర్ ఇండియాలో గోరింటాకు ఫైన్ వేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. సనాతన ధర్మం, సంప్రదాయాలు పాటించడం నేరమా?.. ఇంతకీ మనం భారత దేశాలోనే ఉన్నామా?.. ఘటన పాతది అయినా దారుణమైనదే..

సౌజన్యం: Santosh Kumar Karri గారు
10.03.2018

లెనిన్ ఎవరికి ఆరాదకుడు?

వ్యక్తిపూజ, విగ్రహ సంస్కృతికి నేను వ్యతిరేకం.. విగ్రహాల ఏర్పాటు, పడగొట్టడాన్ని కూడా వ్యక్తిగతంగా సమర్ధించలేను.. కానీ త్రిపురలో లెనిన్ విగ్రహం పడగొట్టారని గగ్గోలు పెడుతున్నవారిని చూసి స్పందించాల్సి వస్తోంది..
రష్యన్ విప్లవం తర్వాత కమ్యూనిస్టు ప్రభుత్వానికి సారధ్యం వహించాడు లెనిన్.. పొరుగు దేశాలను కబలించి సోవియట్ యూనియన్ కు పునాది వేసిన సామ్రాజ్యవాది. కమ్యూనిజం పతనం తర్వాత రష్యాతో సహా, మాజీ సోవియట్ దేశాల్లో లెనిన్ విగ్రహాలు పడగొట్టేశారు. సొంత దేశ ప్రజలే తిరస్కరించిన లెనిన్ భారత కమ్యూనిస్టులకు ఆరాధకుడు. భారత దేశంలో ఎంతో మంది ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు. వారి విగ్రహాలు అవసరం లేదు. కానీ విదేశీయుడి విగ్రహం కూల్చేశారని బాధపడిపోతున్నారు.
లెనిన్ విగ్రహం పడగొట్టారని యాగీ చేస్తున్న కమ్యూనిస్టులు చేస్తున్న పనేమిటి? బెంగాల్ లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని అవమానించారు. ఇది కరెక్టా?.. త్రిపురలో శ్యామల్ కాంతి సేన్ గుప్తా, సుధామయ్ దత్, దేవేంద్ర డె, శుభాంకర్ చక్రవర్తి అనే నలుగు దేశ భక్తులను వామపక్ష ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నప్పుడు ఎవరూ స్పందించలేదు. కేరళలో దేశభక్తుల మారణకాండను పట్టించుకోలేదు.. కడుపు మండి కమ్యూనిస్టు ప్రభుత్వాన్నివదిలించుకున్న త్రిపుర వాసులు విదేశీ భావదాస్య చిహ్నాన్ని వదిలించుకుంటే లొల్లి లొల్లి.. వాహ్వా. క్యా బాత్ హై జీ..
07.03.2018